ఫిషింగ్ స్కామర్స్ ముఠా గుట్టు రట్టు చేసిన స్పెషల్ స్క్వాడ్
- August 26, 2020
దోహా:ఎస్ఎంఎస్ల ద్వారా బ్యాంకింగ్ మోసాలకు పాల్పడుతున్న ముఠాపై డిపార్ట్మెంట్ ఆఫ్ కంబాటింగ్ ఎకనమిక్ అండ్ ఎలక్ట్రానిక్ క్రైవ్స్ు ఉక్కుపాదం మోపింది. జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్‌కి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ కంబాటింగ్ ఎకనమిక్ అండ్ ఎలక్ట్రానిక్ క్రైవ్స్ు, ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి స్కామర్స్ భరతం పట్టింది. ‘అన్ కవరింగ్ మాస్క్’ పేరుతో ఆపరేషన్ చేపట్టి, డజన్ల మంది మోసగాళ్ళ ఆటకట్టించింది. నిందితులు పెద్ద సంఖ్యలో బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బుని దోచేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మొత్తం సుమారుగా 10 మిలియన్ ఖతారీ రియాల్స్ వుంటుందని అధికారులు వివరించారు. ఈ నేరాలకు ఉపయోగించిన మొబైల్ నెంబర్స్‌ని ట్రాక్ చేసి నిందితుల్ని అధికారులు పట్టుకోగలిగారు. ఎస్ఎంఎస్ పేరుతో జనాల్ని మోసగించడం, వారి నుంచి ఓటీపీ తదితర వివరాలు సేకరించి బ్యాంకు ఖాతాల్లోంచి డబ్బు కొల్లగొట్టడం నిందితులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు అధికారులు.
తాజా వార్తలు
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్‌ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...







