దోహా:కోవిడ్ నేపథ్యంలో ఖతార్ స్కూల్ ఉద్యోగులకు తప్పనిసరి ఆరోగ్య పరీక్షలు

- August 26, 2020 , by Maagulf
దోహా:కోవిడ్ నేపథ్యంలో ఖతార్ స్కూల్ ఉద్యోగులకు తప్పనిసరి ఆరోగ్య పరీక్షలు

దోహా:అన్ లాక్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత విద్య సంవత్సరాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్న ఖతార్ ప్రభుత్వం..కోవిడ్ నేపథ్యంలో పలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అన్నిప్రభుత్వ, ప్రైవేట్ పాఠాశాలల టీచింగ్ స్టాఫ్ కు వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. విద్యా సంవత్సరం మొదలవుతున్న నేపథ్యంలో అన్ని స్కూల్స్ లో ఆరోగ్యకర వాతావరణాన్ని నెలకొల్పేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. విద్యార్ధుల ఆరోగ్య సంరక్షణకు తమ ప్రభుత్వం అధిక ప్రధాన్యం ఇస్తోందని, అలాగే స్కూల్ సిబ్బంది క్షేమాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని తరగతులకు హజరయ్యే ముందే స్కూల్ స్టాఫ్ లో ప్రతి ఒక్కరు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఖతార్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే..ప్రభుత్వ పాఠాశాలల ఉపాధ్యాయులకు వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే హమద్ మెడికల్ కార్పోరేషన్ లోనూ వైద్య పరీక్షలు నిర్వహించి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని నిర్దారించుకున్నాకే తరగతులకు హజరుకావాలని ఆరోగ్యశాఖ ఆదేశించింది. ఇక ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు ప్రైవేట్ హెల్త్ సెక్టార్ లో వైద్య పరీక్షలు నిర్వహించుకోవాల్సి ఉంటుంది. అయితే..ముందుగా టీచింగ్ స్టాఫ్ కు ప్రధాన్యం ఇచ్చిన తర్వతే స్కూల్ పరిపాలన విభాగానికి చెందిన అధికారులకు పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్ధుల ఆరోగ్య సంరక్షణ కోసం అమలు చేస్తున్న ఈ నిబంధనలు ఉల్లఘించిన వారికి మూడేళ్లకు మించకుండా జైలు శిక్ష, 2 లక్షల ఖతార్ రియాల్స్ కు మించకుండా జరిమానా విధిస్తామని ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com