దుబాయ్:ప్రవాసులకు కీలక సూచన చేసిన ఇండియన్ కాన్సులేట్

- September 14, 2020 , by Maagulf
దుబాయ్:ప్రవాసులకు కీలక సూచన చేసిన ఇండియన్ కాన్సులేట్

దుబాయ్: భారత ప్రవాసులకు దుబాయ్ లోని ఇండియన్ కాన్సులేట్ కీలక సూచన చేసింది.ఏ కారణం చేతనైనా భారత పౌరులు మరణిస్తే.. ఆ విషయాన్ని కాన్సులేట్ కార్యాలయానికి సాధ్యమైనంద త్వరగా తెలియజేయాలని పేర్కొంది. కాన్సులేట్ ఎమర్జెన్సీ నెంబర్ +971507347676 కు ఫోన్ చేసైనా  లేదా http://deathregistration.dubai.mea.gov.in కు మెయిల్ చేయడం ద్వారా అయినా భారతీయుల మరణ వార్తను కాన్సులేట్ దృష్టికి తీసుకురావలని కోరింది. అలా చేయడం వల్ల.. మృతదేహాలకు అంతిమ సంస్కారాలు త్వరగా పూర్తి చేయడానికి గానీ.. లేదా వాటిని సాధ్యమైనంత తొందరగా స్వదేశానికి తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవొచ్చని వెల్లడించింది. మరణ వార్తను కాన్సులేట్ కార్యలయానికి తెలియజేయకపోవడం వల్ల ప్రస్తుత పరిస్థితుల్లో మార్చురీలపై అదనపు భారం పడుతుందని కాన్సులేట్ కార్యాలయం వివరించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com