భాగ్యనగరంలో రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు
- September 14, 2020
హైదరాబాద్ : హైదరాబాద్ లో రోజురోజుకూ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. నయా మోసం వెలుగులోకి వచ్చింది.హైదరాబాద్‌లో ఇప్పుడు కొందరు దుండగులు నయా మోసాలకు పాల్పడుతున్నారు. ఫేస్‌బుక్‌లో ఉన్న పోలీసు, ప్రభుత్వ అధికారుల ప్రొఫైల్ ఫొటోల తీసుకుని ఆ ఫొటోలతో నకిలీ ఖాతాలు ఓపెన్ చేసి కొందరు దుండగులు మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఈ ఫొటోలతో స్నేహితులకు మనీ అర్జంట్‌గా ఉందంటూ మెసేజ్‌లు చేసి మోసం చేస్తున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొంతమంది పోలీసులు హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇలా ఎవరికైనా గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి డబ్బులు పంపించాలని కోరితే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఎంక్వయిరీ చేసుకోవాలని సైబర్ పోలీసులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- మస్కట్ లో ఏపీ వాసి మృతి
- ఢిల్లీ బాంబు బ్లాస్ట్ విషయంలో మా సాయం అక్కర్లేదు..మార్కో రూబియో
- డబ్ల్యూటిఐటిసి 2025 కౌంట్‌డౌన్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!
- రియాద్ లో ఆఫాక్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ ప్రారంభం..!!
- ‘వన్ ఓషన్, అవర్ ఫ్యూచర్ ’ గ్రాండ్ సక్సెస్..!!
- ఒమన్ ఎయిర్ కొత్త సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ కంటి సమస్యలపై స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!







