కోవిడ్ 19 అన్‌లాక్: సినిమా హాల్స్ సామర్థ్యం పెంపు
- September 15, 2020
దోహా:కరోనా వైరస్ (కోవిడ్ 19) అన్‌లాక్‌లో భాగంగా సినిమా హాళ్ళు అలాగే జిమ్ వంటివాటి సామర్థ్యాన్ని పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్ 15 నుంచి ఈ వెసులుబాట్లు వర్తిస్తాయని సుప్రీం కమిటీ ఫర్ క్రైసిస్ మేనేజ్‌మెంట్ ఓ ప్రకటనలో వెల్లడించింది. సినిమా హాల్స్‌లో సీటింగ్ సామర్థ్యం పెంచడం, అలాగే జిమ్ వంటి వాటిల్లో ఎక్కువమందికి అవకాశం కల్పించడం వంటివి తాజా నిర్ణయాల్లో భాగంగా వున్నాయి. కాగా, సెప్టెంబర్ 1 నుంచి కొన్ని రిస్ట్రిక్షన్స్‌ని తొలగించడం జరిగింది. సినిమా హాళలలో 30 శాతం వరకు కెపాసిటీని పెంచారు. అయితే, 18 ఏళ్ళ పైబడినవారు మాత్రమే అందులోకి అనుమతిస్తారు. జిమ్ లు అలాగే హెల్త్ క్లబ్స్, పబ్లిక్ స్విమ్మింగ్ పూల్స్‌లో 30 శాతం మందికి అనుమతిస్తున్నారు. అయితే, కోవిడ్ ప్రికాషన్స్ మాత్రం తప్పక తీసుకోవాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష
- ఏపీలో వేసవిని తలపిస్తున్న ఎండలు
- కల్తీ మద్యం తాగి 14 మంది మృతి..
- ISRO ప్రైవేటీకరణపై క్లారిటీ ఇవ్వండి
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!







