జేవాకింగ్‌: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

- September 17, 2020 , by Maagulf
జేవాకింగ్‌: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

రస్‌ అల్‌ ఖైమా:28 ఏళ్ళ ఆసియా జాతీయుడు, రస్‌ అల్‌ ఖైమాలో జరిగిన ‘రన్‌ ఓవర్‌ యాక్సిడెంట్‌’లో ప్రాణాలు కోల్పోయారు. వకాలత్‌ రోడ్డుపై రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఆ వ్యక్తిని ఓ వాహనం వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టింది. రోడ్డు దాటేందుకు నిర్దేశించిన ప్రాంతంలో కాకుండా, వేరే ప్రాంతంలో ఆ వ్యక్తి రోడ్డు దాటినట్లు గుర్తించారు. సంఘటన జరిగిన వెంటనే పోలీస్‌ పెట్రోల్స్‌, పారామెడిక్స్‌ అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే, అప్పటికే ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాన్ని మార్గ్‌కి తరలించారు. ట్రాఫిక్‌ అండ్‌ పెట్రోల్స్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ బ్రిగేడియర్‌ అహ్మద్‌ అల్‌ సామ్ అల్‌ నక్బి మాట్లాడుతూ, పాదచారులు, రోడ్డు దాటేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంతాలనే వినియోగించాలని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com