దుబాయ్:ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ సేవలు నిలిపివేత
- September 18, 2020
దుబాయ్:కరోనా సంక్షోభం కాలంలో వందేభారత్ మిషన్ కింద విదేశీ ప్రయాణికులను చేరవేస్తున్న ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ సేవలకు మరోసారి కరోనా సెగ తగిలింది. ఎయిరిండియా విమానంలో దుబాయ్ వెళ్లిన ఒక ప్రయాణీకుడికి కోవిడ్-19కు పాజిటివ్ రావడంతో DCAA సీరియస్ గా స్పందించింది. ఎయిరిండియా ఎక్స్ప్రెస్ కార్యకలాపాలను15 రోజులపాటు నిషేధించింది. ఈ సస్పెన్షన్ సెప్టెంబర్ 18 నుండి అక్టోబర్ 2 వరకు కొనసాగుతుందని ప్రకటించింది.
సెప్టెంబర్ 4న జైపూర్ నుండి దుబాయ్ వచ్చిన ప్రయాణీకుడికి కరోనా నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని దుబాయ్ అధారిటీ తన సస్పెన్షన్ నోటీసులో పేర్కొంది. ఇలా వైరస్ సోకిన ప్రయాణీకుడిని గుర్తించకపోవడం ఇది రెండవసారని ఎయిరిండియాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సెప్టెంబరు 2వ తేదీన జైపూర్ లోని ఒక డయాగ్నిస్టిక్ సెంటర్ ద్వారా అతనికి పాజిటివ్ రిపోర్టు వచ్చిందని, అయినా నిర్లక్ష్యంగా వ్యవహించారని పేర్కొంది. తద్వారా విమానంలో ఉన్న ఇతర ప్రయాణీకులను ప్రమాదంలో పడేసారనీ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రాంతీయ మేనేజరుకు రాసిన లేఖలో ఆరోపించింది.
తాజా వార్తలు
- ముగిసిన రెడ్ వేవ్ 8 నావల్ డ్రిల్..!!
- దుబాయ్ లో T100 ట్రయాథ్లాన్..ఆర్టీఏ అలెర్ట్..!!
- బహ్రెయిన్ లో దీపావళి మిలన్..!!
- STPలో నీటి నాణ్యతపై అధ్యయనం..!!
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?







