యూఏఈ:వాతావరణ మార్పులపై ఎన్సీఎం సూచనలు
- September 19, 2020
యూఏఈ:ఇవాళ, రేపు వాతావరణంలో మార్పులు చోటు చేసుకోనున్నట్లు జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. తీర ప్రాంతాలతో పాటు పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి నుంచి ఉదయం 9గంటల వరకు మంచు దట్టంగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయని ప్రకటించింది. ముఖ్యంగా పశ్చిమ ప్రాంతాల్లో మంచు తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని...మంచు దుప్పటి కారణంగా దృశ్య దూరం తగ్గుతుందని వెల్లడించింది. ఉదయం వెళలో మంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు దూరంగా ఉన్నప్పుడు కనిపించకపోవచ్చని, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఆదివారం తెల్లవారుజామున కూడా ఇదే తరహా వాతావరణం కొనసాగుతుందని చెబుతున్నారు. అయితే పగలు ఎండ తీవ్రత ఎప్పటిలాగే కొనసాగుతుందని..గరిష్టంగా 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవ్వొచ్చని జాతీయ వాతావరణ కేంద్రం అధికారులు అన్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు