ఒమన్:శాశ్వతంగా దేశం విడిచి వెళ్లే ప్రవాసీయులకు జరిమానాల రద్దు
- September 24, 2020
మస్కట్:కొంత కాలంగా ఒమనైజేషన్ విధానాన్ని శరవేగంగా అమలు చేస్తున్న ఒమన్ ప్రభుత్వం...అందుకు అనుగుణంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ 19 సంక్షోభం నేపథ్యంలో దేశంలోని ప్రవాసీయులు శాశ్వతంగా ఒమన్ నుంచి వెళ్లిపోతే జరిమానాలు పూర్తిగా రద్దు చేస్తామని ప్రకటించింది. ఈ వెసులుబాటు ఈ ఏడాది చివరి వరకు అమలులో ఉంటుందని తెలిపింది. ఒమనేతరులను దేశం నుంచి పంపించివేసేందుకు ఇదోక మంచి మార్గమని ఆ దేశ ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాదు..అటు ప్రైవేట్ సంస్థలు కూడా ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా తమ సంస్థల్లోని ఒమనేతర కార్మిక శక్తిని కుదించే దిశగా ప్రవాసీయుల కాంట్రాక్ట్ లను రద్దు చేసుకుంటోంది. కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిలను చెల్లించి పంపించివేస్తున్నారు. అయితే..పైకి కోవిడ్ 19 సంక్షోభ సమయంలో ప్రవాసీయులకు జరిమానా మినహాయింపు ఊరట కలిగించే ప్రకటనలానే కడపడుతున్నా..ఒమన్ ప్రభుత్వ నిర్ణయంలో ఒమనైజేషన్ లక్ష్యంగా ప్రధానంగా కనిపిస్తోంది. ఒక దెబ్బకు రెండు పిట్టల తరహాలో దేశంలోని ప్రవాసీయులను కోవిడ్ ముసుగులో వదలించుకుంటున్నట్లు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







