హవాలీ మునిసిపాలిటీలో పనిచేస్తున్న వలస మహిళపై విచారణ

- September 24, 2020 , by Maagulf
హవాలీ మునిసిపాలిటీలో పనిచేస్తున్న వలస మహిళపై విచారణ

కువైట్‌ సిటీ: మినిస్టర్‌ ఆఫ్‌ స్టేట్‌ ఫర్‌ మునిసిపల్‌ ఎఫైర్స్‌ వాలిద్‌ అల్‌ జస్సెవ్‌ు, కువైట్‌ మునిసిపాలిటీ డైరెక్టర్‌ అహ్మద్‌ అల్‌ మన్‌ఫౌహికి ఓ కేసు విచారణ విషయమై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సదరు మహిళ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నట్లు అభియోగాలు మోపబడ్డాయి. సంబంధిత పత్రాల విశ్వసనీయత సహా పలు అంశాలపై విచారణ జరపాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. కరోనా పాండమిక్‌ సిట్యుయేషన్‌లో సదరు మహఙళ ఓ కేఫ్‌లో పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. హవాలి గవర్నరేట్‌ మునిసిపాలిటీకి చెందిన వయొలేషన్స్‌ రిమూవల్‌ డిపార్ట్‌మెంట్‌, ఈ విషయమై ఫిర్యాదు చేయడం జరిగింది. ఆమెకు కేటాయించిన పని, దీనికి సంబంధించిన చట్టబద్ధత వంటి అంశాలపై విచారణ జరపనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com