2022 నాటికి 25 శాతం ఖతార్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సుల ఎలక్ట్రిఫికేషన్
- September 24, 2020
దోహా:స్టేట్ ఆఫ్ ఖతార్, 25 శాతం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సుల ఎలక్ట్రిఫికేషన్ 2022 నాటికి పూర్తి చేయనున్నట్లు వెల్లడించింది. పబ్లిక్ బస్‌లు, పబ్లిక్ స్కూల్స్ బస్సులు, దోహా మెట్రో ఫీడర్ బస్సులు క్రమంగా ఎలక్ట్రిక్ బస్సులుగా రూపాంతరం చెందనున్నాయి. కార్బన్ ఎమిషన్స్ తగ్గించే క్రమంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్స్ రూపొందించిన స్ట్రేటజీ ప్రకారం ఈ కార్యక్రమం చేపట్టబడుతోంది. ఖతార్ నేషనల్ విజన్ 2030 ప్రకారం ఎకనమిక్ అలాగే ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ కీలకమైన మైలు రాళ్ళను అందుకోనుంది. 2022 ఫిఫా వరల్డ్ కప్ సందర్భంగా ఈ ఎలక్ట్రిక్ బస్సుల్ని విరివిగా వినియోగిస్తారు. వ్యూహాత్మక ప్లాన్స్ ప్రకారం ఖతార్ జనరల్ ఎలక్ట్రిసిటీ మరియు వాటర్ కార్పొరేషన్, మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్‌తో కలిసి ఆయా అంశాలపై ఎప్పటికప్పుడు సమాలోచనలు జరుపుతూనే వుంది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







