ఈ ఏడాది స్ప్రింగ్ క్యాంప్ సీజన్ ను రద్దు చేసిన కువైట్ మున్సిపాలటి
- September 25, 2020
కనుచూపు మేర అంతా ఇసుకమయం. సెగలు పుట్టించే ఎండల తర్వాత చల్లని గాలిలో ఇసుక తెన్నల మీద సేద తీరుతూ..క్యాంప్ ఫైర్ వెలుతురులో టెంట్ లో డిన్నర్ చేస్తే ఆ థ్రిల్లింగే వేరు. ఏడారిలో విడిది చేసేందుకు ప్రపంచంలోని పలు దేశాల నుంచి కువైట్ వస్తుంటారు. కానీ, ఈ ఏడాది మాత్రం ఏడారి విడిది చేయాలని ముచ్చటపడుతున్న వారికి నిరాశను కలిగించింది కరోనా సీజన్. కరోనా తీవ్రత కొనసాగుతుండటంతో ఏడాది స్ప్రింగ్ క్యాంప్ సీజన్ ను రద్దు చేస్తున్నట్లు కువైట్ మున్సిపాలిటీ ప్రకటించింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచనలకు అనుగుణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం కరోనా ప్రబలుతున్న తీవ్రతను అరికట్టే చర్యలపై చర్చించేందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని నిపుణులు సమావేశమయ్యారని కువైట్ మున్సిపాలిటి డైరెక్టర్ తెలిపారు. అంతర్జాతీయంగా కోవిడ్ గణాంకాలను పరిగణలోకి తీసుకొని పలు నిర్ణయాలు తీసుకున్న నిపుణుల బృందం ఈ ఏడాది ఏడారి విడిదిని రద్దు చేయాలని నిర్ణయించినట్లు మున్సిపాలిటి డైరెక్టర్ వివరించారు. అలాగే ఎన్నికల ప్రచారం, ఎన్నికల నిర్వహణపై కూడా చర్చించి..ప్రస్తుతానికి ఎన్నికలను వాయిదా వేయటమే మంచిదని సూచించినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







