మాల్స్, బీచ్ లలో కోవిడ్ నిబంధనలు పట్టించుకోని 1,672 మందికి ఫైన్
- September 25, 2020
అబుధాబి: కోవిడ్ 19 నియంత్రణ కోసం చేపట్టిన ముందస్తు జాగ్రత్త చర్యలను బేఖాతారు చేసిన వారికి జరిమానాలు విధించింది అబుధాబి పోలీసులు. గత రెండు నెలల్లో మొత్తం 1,672 జరిమానాలు విధించారు. ఎమిరాతి పరిధిలోని షాపింగ్ మాల్స్, బీచ్ లలో ముందు జాగ్రత్త చర్యలు పాటించడంలో విఫలమైన ప్రజలకు జరిమానాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిలో ఎక్కువగా ఫేస్ మాస్క్‌లు ధరించకపోవడం, భౌతిక దూరాన్ని పాటించకపోవటం, జన సమ్మర్ధ సమావేశాలకు హాజరు కావడం, అనుమతి పరిమితికి మించి ఎక్కువ వ్యక్తులతో సమావేశాలను నిర్వహించిన వారు ఉన్నారు. కరోనా నియంత్రణకు ప్రజలు, ప్రవాసీయులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పోలీసులు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







