ఒమన్ చేరుకునే వాళ్లందరికి కోవిడ్ టెస్ట్..ప్రయాణికుల నుంచే టెస్ట్ ఛార్జీల వసూలు

- September 25, 2020 , by Maagulf
ఒమన్ చేరుకునే వాళ్లందరికి కోవిడ్ టెస్ట్..ప్రయాణికుల నుంచే టెస్ట్ ఛార్జీల వసూలు

ఒమన్: వివిధ దేశాల నుంచి ఒమన్ చేరుకునే ప్రయాణికులు అందరూ తప్పనిసరిగా పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని ఒమన్ పౌర విమానయాన అధికారులు వెల్లడించారు. విమానం దిగ్గానే కోవిడ్ 19 నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని, ఇందుకోసం ఒక్కో ప్రయాణికులు 25 ఒమనీ రియాల్స్ చెల్లించాలని తెలిపింది. ఒమన్ పౌర విమానయాన అధికారులు విడుదల చేసిన ప్రయాణ మార్గదర్శకాల జాబితాలో ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే..ఫ్లైట్ సిబ్బందితో పాటు 15 ఏళ్ల కంటే తక్కువ ఉన్నవారికి మాత్రం కోవిడ్ టెస్టులు అవసరం లేదని కూడా అధికారులు చెప్పారు. ఇదిలాఉంటే..ఒమనీ చేరుకున్న ప్రతీ ప్రయాణికుడు తరస్సద్ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలని కూడా సూచించారు. వారం పాటు ఒమన్ లోనే వాళ్లంతా తప్పనిసరిగా యాప్ లో రిజిస్టర్ అవ్వాలి. ఒక వేళ ఎనిమిది రోజులకు మించి ఒమన్ లోనే ఉంటే తారస్సద్ ప్లస్ బ్రాస్లెట్ ధరించి 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని పౌర విమానయాన అధికారులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com