కొత్తగా 225 కరోనా పాజిటివ్‌ కేసులు

- September 25, 2020 , by Maagulf
కొత్తగా 225 కరోనా పాజిటివ్‌ కేసులు

దోహా: మినిస్ట్రీ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ వెల్లడించిన వివరాల ప్రకారం కొత్తగా 225 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 249 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కాగా, ఇప్పటిదాకా మొత్తం కోలుకున్నవారి సంఖ్య 121,512కి చేరుకుంది. కొత్తగా నమోదైన 225 కేసుల్లో 216 కమ్యూనిటీ కేసులు కాగా, విదేశాల నుంచి వచ్చిన 9 మందికి కరోనా సోకినట్లు తేలింది. కొత్తగా కరోనా సోకినవారికి తగిన వైద్య చికిత్స అందించడం జరుగుతోంది. వారంతా ఐసోలేషన్‌లో వున్నారు. ఇదిలా వుంటే, దేశంలో మొత్తంగా 124,650 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 2926 మంది ప్రస్తుతం యాక్టివ్‌ కేసులుగా వున్నారు. 212 మంది ఇప్పటిదాకా ప్రాణాలు కోల్పోయారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com