దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి, ఎలివేటెడ్ కారిడార్‌ల‌ను ప్రారంభించిన మంత్రి కె.టి.ఆర్

- September 25, 2020 , by Maagulf
దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి, ఎలివేటెడ్ కారిడార్‌ల‌ను ప్రారంభించిన మంత్రి కె.టి.ఆర్

హైద‌రాబాద్‌:రూ.184 కోట్ల‌తో నిర్మించిన‌ దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జితో పాటు, రోడ్ నెంబర్ :45 నుండి దుర్గంచెరువు వరకు రూ. 150 కోట్ల‌తో నిర్మించిన 4 లేన్ల ఎలివేటెడ్ కారిడార్ లను శుక్ర‌వారం సాయంత్రం రాష్ట్ర పురపాలక, ఐ టీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు  ప్రారంభించారు.ఈ కార్య‌క్ర‌మంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర మంత్రులు మహ్మద్  మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, వి.శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్, ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ,  ఎంపి డా.జి.రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్‌, పుర‌పాల‌క శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రి అర్వింద్ కుమార్‌, జిహెచ్ఎంసి క‌మిష‌న‌ర్ డి.ఎస్‌.లోకేష్ కుమార్, ప్రాజెక్ట్స్ చీఫ్ ఇంజ‌నీర్ శ్రీ‌ధ‌ర్‌, ఎస్‌.ఇ. వెంక‌ట‌ర‌మ‌ణ‌, స్థానిక కార్పొరేట‌ర్లు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com