బహ్రెయిన్:ప్రవాసీయులు ఉండే ఇళ్ల పరిస్థితి, కోవిడ్ జాగ్రత్త చర్యలను పరిశీలించిన అధికారులు
- September 28, 2020
మనామా:కోవిడ్ వ్యాప్తి నియంత్రణ చర్యలతో పాటు విదేశీ కార్మికుల భద్రతను పరిశీలించేందుకు మనామాలోని ఉత్తర ప్రాంతంలో నార్తర్న్ గవర్నరేట్ గవర్నర్ సంబంధిత అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ప్రవాస కార్మికులు ఉంటున్న ఇళ్లను వాటి స్థితిగతులను పరిశీలించారు. కార్మికుల భద్రతకు అనుగుణంగా ఇళ్లు ఉన్నాయో లేదోనని తనిఖీ చేశారు. అలాగే కార్మికులు కరోనా బారిన పడుకుండా అంతర్గత మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాల మేరకు వసతులు ఉన్నాయా? లేదా? అనే విషయాలను కూడా పరిశీలించారు. అద్దె కోసం ఇరుకు గదుల్లో పరిమితికి మంచి ఎక్కువ మందికి ఆశ్రయం కల్పించవద్దని, కరోనా నేపథ్యంలో పరిమితికి మించి ఒకే గదిలో ఎక్కువ మంది ఉన్నా అది చట్ట విరుద్ధమని గవర్నర్ హెచ్చరించారు. భౌతిక దూరం పాటించేలా గదుల్లో ప్రభుత్వ మార్గనిర్దేశకాల మేరకు పరిమిత సంఖ్యలో ఉండాలన్నారు.
తాజా వార్తలు
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్