క్రేజీ కాంబినేషన్..సుకుమార్ డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ..
- September 28, 2020
హైదరాబాద్:తన చిత్రాలతో యువ హృదయాలను కొల్లగొట్టే విజయ్ దేవరకొండ, సాధారణ ప్రేక్షకుడిని సైతం తన కథతో మెస్మరైజ్ చేసే దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కనుంది. సినిమాల మీద ప్యాషన్‌తో కేదార్ సెలగం శెట్టి అనే ఓ యువ నిర్మాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారు. ఫాల్కన్ క్రియేషన్స్ ఎల్ ఎల్ పి అనే బ్యానర్‌పై చిత్రాలు నిర్మించడానికి తొలి అడుగులు వేస్తున్నారు. మొదటి చిత్రమే టాప్ డైరక్టర్ సుకుమార్‌ని, క్రేజీ హీరో విజయ్ దేవరకొండతో చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత కేదార్ తన పుట్టిన రోజు సందర్భంగా తాను చేయబోయే మొదటి చిత్రం గురించి చెప్పారు. ఈ ముగ్గురి కాంబినేషన్లో ఈ చిత్రం 2022లో మొదలవనుంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇక సుక్కు, విజయ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విషయాలను త్వరలో తెలియజేస్తామని కేదార్ అన్నారు.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!