ఆపదలో ఉన్న మహిళను ఆదుకున్న ఒమన్ తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్
- October 14, 2020
మస్కట్:తెలంగాణ లోని కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం ధర్మారావు పేటకు చెందిన సుంకరి అనసూర్య ఈరోజు ఒమన్ తెలంగాణ ఫ్రెండ్స్ అధ్యక్షులు నరేంద్ర పన్నీరు మరియు మురళి వడ్లపట్ల సహకారం తో తెలంగాణ కు చేరుకున్నారు.ఉపాధి కోసం ఇంట్లో పనిచేయడానికి ఒమన్ కు వచ్చిన సుంకరి అనసూర్య గత కొద్ది నెలలుగా అనారోగ్య సమస్యల తో ఉన్న తన ఇద్దరు అక్కలను చూడడానికి కరోన కారణంగా విమాన చార్జీలు పెరగడం మరియు తన వీసా గడువు ముగియకపోవడం తో తమ యజమాని పంపించడానికి అంగీకరించలేదు.ఎటు దిక్కుతోచని స్థితిలో అనసూర్య తన బాధను వీడియో ద్వారా పంచుకోవడం తో అది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. అది నరేంద్ర పన్నీరు దృష్టికి రావడం తో ఆమె అడ్రస్ కనుక్కుని యజమాని తో మాట్లాడి ఒప్పించి విమాన టికెట్ అందించి ఇండియా పంపించారు. ఈ సందర్భంగా నరేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి అనసూర్య కు పునరావాసం కల్పించి ఆదుకోవలసిందిగా విజ్ఞప్తి చేశారు.మురళి వడ్లపట్ల, మంచికట్ల కుమార్, రమేష్ గరిగే, వేమనకుమార్ కాశ తదితరులు సహాయసహకారాలు అందించారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం