నకిలీ ఉద్యోగ ఏజెంట్లకు 345,000 బహ్రెయినీ దినార్స్‌ జరీమానా

- October 20, 2020 , by Maagulf
నకిలీ ఉద్యోగ ఏజెంట్లకు 345,000 బహ్రెయినీ దినార్స్‌ జరీమానా

బహ్రెయిన్: లోవర్‌ క్రిమినల్‌ కోర్ట్‌, డొమెస్టిక్‌ వర్కర్స్‌కి సంబంధించి ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి మోసంచేస్తున్న నకిలీ ఉద్యోగ ఏజెంట్లకు 345,000 బహ్రెయినీ దినార్స్‌ జరీమానా విధించడం జరిగింది. ఈ కేసుల్లో మొత్తం 22 మంది వ్యక్తులు దోషులుగా తేలారు. చీఫ్‌ ప్రాసిక్యూటర్‌ (మినిస్ట్రీస్‌ అండ్‌ పబ్లిక్‌ బాడీస్‌ ప్రాసిక్యూషన్‌) బదర్‌ అల్‌ హాసన్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. మొత్తం 7 కేసుల్లో న్యాయస్థానం ఈ జరీమానాల్ని ఖరారు చేసింది. 1,000 నుంచి 24,000 బహ్రెయినీ దినార్స్‌ వరకు నిందితులకు జరీమానా విధించారు. లేబర్‌ మార్కెట్‌ రెగ్యులేటరీ అథారిటీ నుంచి అందిన ఫిర్యాదుల మేరకు ఈ చర్యలు చేపట్టారు. నిబంధనల మేరకు మాత్రమే డొమెస్టిక్‌ వర్కర్స్‌ నియామకాలు జరగాల్సి వుంటుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com