నకిలీ ఉద్యోగ ఏజెంట్లకు 345,000 బహ్రెయినీ దినార్స్ జరీమానా
- October 20, 2020
బహ్రెయిన్: లోవర్ క్రిమినల్ కోర్ట్, డొమెస్టిక్ వర్కర్స్‌కి సంబంధించి ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి మోసంచేస్తున్న నకిలీ ఉద్యోగ ఏజెంట్లకు 345,000 బహ్రెయినీ దినార్స్ జరీమానా విధించడం జరిగింది. ఈ కేసుల్లో మొత్తం 22 మంది వ్యక్తులు దోషులుగా తేలారు. చీఫ్ ప్రాసిక్యూటర్ (మినిస్ట్రీస్ అండ్ పబ్లిక్ బాడీస్ ప్రాసిక్యూషన్) బదర్ అల్ హాసన్ ఈ విషయాన్ని వెల్లడించారు. మొత్తం 7 కేసుల్లో న్యాయస్థానం ఈ జరీమానాల్ని ఖరారు చేసింది. 1,000 నుంచి 24,000 బహ్రెయినీ దినార్స్ వరకు నిందితులకు జరీమానా విధించారు. లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ నుంచి అందిన ఫిర్యాదుల మేరకు ఈ చర్యలు చేపట్టారు. నిబంధనల మేరకు మాత్రమే డొమెస్టిక్ వర్కర్స్ నియామకాలు జరగాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!