నేమ్ అండ్ షేమ్: సౌదీ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ చర్యలు
- October 20, 2020సౌదీ: సౌదీ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, ఓ పౌరుడ్ని డిఫేవ్ు చేస్తూ నిర్ణయం తీసుకుంది. యాంటీ కమర్షియల్ కాన్సీల్మెంట్ చట్టాన్ని నిందితుడు అల్లంఘించినట్లు అధికారులు గుర్తించారు. శాటిలైట్ టీవీ రిసీవర్స్ ట్రేడ్‌లోకి ఓ బంగ్లాదేశీ వ్యక్తిని తీసుకొచ్చి, నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లు మినిస్ట్రీ పేర్కొంది. ఈ నేపథ్యంలో క్రిమినల్ కోర్ట్ బురైదాహ్ ఇచ్చిన తీర్పుని మినిస్ట్రీ పబ్లిష్ చేసింది. జరీమానా, ఆ ఫెసిలిటీ మూసివేత, లైసెన్స్ క్యాన్సిలేషన్, కమర్షియల్ రిజిస్ట్రీ రైటాఫ్ వంటి చర్యలకు సంబంధించి పూర్తి వివరాలు పేర్కొన్నారు. తన నెలవారీ సంపాదనతో సంబంధం లేకుండా సదరు రెసిడెంట్, ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది. కాగా, ఇలాంటి కేసుల్లో ఐదేళ్ళ జైలు శిక్షతోపాటు, భారీ జరీమానాలు కూడా వుంటాయి. ఐదు మిలియన్ రియాల్స్ వరకూ జరీమానా విదించే అవకాశం వుంటుంది.
తాజా వార్తలు
- పాకిస్థాన్‌లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్