మీ గుప్పిట్లో మీ బరువు..!
- February 14, 2016
మారుతున్న జీవనశైలి దృష్ట్యా వూబకాయం సమస్య ఎంతో మందిని బాధిస్తుంది. స్థూలకాయాన్ని తగ్గించు కునేందుకు ఖర్చుపెట్టి జిమ్లూ, యోగా కేంద్రాలకు వెళ్లడమే కాదు....ఇంట్లో ఉండి కూడా కొన్ని నియమాలు పాటిస్తూ బరువును గుప్పిట్లో పెట్టుకోవచ్చు. ఎలాగంటే... గ్లాసు నీళ్లు: ఆరోగ్యానికి నీళ్లు చేసే మేలు అంతా ఇంతకాదు. బరువు తగ్గే విషయంలోనూ నీళ్ల పాత్ర కీలకమే. భోజనమే కాదు.. ఏ పదార్థమైనా తీసుకోవడానికి ముందు గ్లాసు నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పొట్ట నిండిన భావన కలుగుతుంది. కెలొరీలు కూడా ఖర్చవుతాయి.కాబట్టి ఎక్కువ ఆహారం తీసుకునే అవకాశం తక్కువ.
ఇంటిభోజనం: చాలామంది బయట దొరికే చిరుతిళ్లకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. భోజనమే కాదు... మిగతావేవైనా సరే ఇంటి నుంచి తీసుకెళ్లేలా ప్రణాళిక వేసుకోవాలి. దీనివల్ల అధిక కెలొరీలు అందే ఆస్కారమే ఉండదు. కార్బోహైడ్రేట్లూ తక్కువగా అందుతాయి. ఆరోగ్యానికీ చాలా మంచిది. అలాగే ఆలస్యంగా తినకుండా ఉండటం మంచిది. రాత్రిపూట భోజనాన్ని ముందుగా ముగించేయాలి. నడక: దీనితో ఎన్నో సమస్యలను దూరం చేసుకోవచ్చు. ముఖ్యంగా బరువు అదుపులోకి వస్తుంది. పైగా, నడక ఖర్చులేని పని. కనీసం రోజులో అరగంట నడిచినా చక్కటి ఫలితం ఉంటుంది. అలానే ఉదయం పూట త్వరగా లేచి.. ఇంట్లో పనులు చకచకా చక్కబెట్టుకోవడం అలవాటు చేసుకుంటే అదనపు కెలొరీలూ ఖర్చవుతాయి. మెట్లు: సాధ్యమైనంత వరకూ లిఫ్ట్ వాడకాన్ని తగ్గించి.. మెట్లు ఎక్కి దిగడం మంచిది. ఇలా చేయడం వల్ల వ్యాయామం చేసిన ఫలితం దక్కుతుంది. ప్రతిసారీ మెట్లు ఎక్కిదిగడం కష్టమైతే కనీసం రోజులో రెండుమూడు సార్లైనా ఈ పని చేయాలి. కీళ్లు, మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు మెట్లు ఎక్కి దిగే విషయంలో వైద్యుల్ని సంప్రదించాలి. పండ్ల ముక్కలు: రోజులో ఒకసారి భోజనానికి బదులు ఓ పెద్ద కప్పు నిండా పండ్ల ముక్కలు తీసుకోవాలి. పండ్లలో కొవ్వు ఉండదు. కెలొరీలూ చాలా స్పల్పం. పండ్లలోని పోషకాలు యాంటీఆక్సింట్లుగా మారి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బరువు పెరిగే సమస్య ఉండదు. ఎన్ని పండ్ల ముక్కలు తీసుకున్నా ఇబ్బంది ఉండదు. రోగనిరోధక శక్తీ పెరుగుతుంది. మిఠాయిలు వద్దు: బరువు తగ్గేటప్పుడు ఎన్ని నియమాలు పాటించినా సరే వాటితోపాటూ మిఠాయిలకు దూరంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. అలానే టీ, కాఫీల్లోనూ చక్కెర తక్కువగా వేసి తీసుకోవాలి. చక్కెర ఎక్కువ మోతాదులో శరీరానికి అందడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. శీతలపానీయాలకూ దూరంగా ఉండాలి.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









