హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రయాణికులకు E-బోర్డింగ్
- October 27, 2020_1603782229.jpg)
హైదరాబాద్:GMR ఆధ్వర్యంలోని హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అన్ని దేశీయ గమ్యస్థానాలకు, అన్ని ఎయిర్‌లైన్స్ ద్వారా మొదటి నుంచి చివరి వరకు e-బోర్డింగ్ సేవలను అందిస్తున్న విమానాశ్రయంగా గుర్తింపు పొందింది.హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు ‘ఆత్మనిర్భర్’ స్ఫూర్తిని కొనసాగిస్తూ, తాము సొంతంగా తయారు చేసిన ఈ డిజిటల్ సొల్యూషన్‌ను అంతర్జాతీయ ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చి, తద్వారా భారతదేశంలో అంతర్జాతీయ ప్రయాణికులకు e-బోర్డింగ్ సేవలను ప్రారంభించిన మొట్టమొదటి విమానాశ్రయంగా నిలిచింది. భారత విమానయాన రంగంలోనే ఇదొక గొప్ప మైలురాయి.
భారత ప్రభుత్వ డిజిటల్ ఇండియా లక్ష్యానికి అనుగుణంగా, GHIAL యొక్క అంతర్జాతీయ e-బోర్డింగ్ సేవలు ఈ కోవిడ్ మహమ్మారి కాలంలో అంతర్జాతీయ ప్రయాణీకులకు భద్రతను మరింత చేకూరుస్తాయి. ప్రస్తుతం ఈ సేవలు ఇండిగో ఎయిర్ లైన్స్ యొక్క ఎంపిక చేసిన అంతర్జాతీయ విమాన సర్వీసుల ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి. పైలెట్ ప్రయోగాలు విజయవంతమై, ప్రభుత్వ ఆమోదం పొందిన అనంతరం ఈ e-బోర్డింగ్ సేవలను అంతర్జాతీయ ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చారు.
అక్టోబర్ 2న ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన షార్జా విమానం 6E 1405 విమానం ప్రయాణికులు హైదరాబాద్ నుండి ఈ-బోర్డింగ్ సేవలను అందుకున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరే మిగతా అంతర్జాతీయ షెడ్యూల్డ్ విమాన సర్వీసులలోనూ e-బోర్డింగ్ సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ప్రదీప్ పనికర్, సీఈఓ, జీహెచ్‌ఐఎల్, " సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని హైదరాబాద్ విమానాశ్రయంలో ప్రయాణీకులకు మెరుగైన అనుభవాన్ని ఇవ్వడానికి మేము నిరంతరం కృషి చేస్తున్నాము. ఈ క్రమంలో, దేశీయ విమాన సర్వీసులలో 5 సంవత్సరాల పాటు ఈ-బోర్డింగ్ విజయవంతమైన తరువాత, అంతర్జాతీయ విమాన సేవలలో ఈ-బోర్డింగ్ ప్రారంభిస్తున్నాము. భారతీయ విమానాశ్రయాలలో అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు ఈ-బోర్డింగ్ ను అందుబాటులోకి తీసుకువచ్చిన మొట్టమొదటి విమానాశ్రయం మనది. ప్రస్తుత కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ప్రయాణికుల ప్రయాణ కార్యకలాపాలను ఆటోమేట్ చేయడం వల్ల వారు మరింత సురక్షితంగా, మరింత ధైర్యంతో ప్రయాణాలు చేయగలుగుతారు.పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతమై, అన్ని రకాల ఆమోద ప్రక్రియలూ ముగిసిన అనంతరం అంతర్జాతీయ ప్రయాణికులకు దీనిని అందుబాటులోకి తీసుకు వస్తున్నాము.” అన్నారు.
అంతే కాకుండా ఆయన, "మా ప్రధాన భాగస్వామి ఇండిగో, విమానాశ్రయంలోని పలువురు భాగస్వాముల సంయుక్త కృషి, సహకారంతోనే విమానాశ్రయంలో ఈ-బోర్డింగ్ అమలు విజయవంతంగా జరుగుతోంది. ఈ ఈ-బోర్డింగ్ త్వరలో హైదరాబాద్ నుండి నడిచే అన్ని అంతర్జాతీయ విమానయాన సంస్థలు ఉపయోగించుకుంటాయని ఆశిస్తున్నాము. ” అన్నారు.
అంతర్జాతీయ ఈ-బోర్డింగ్ వల్ల కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు:
· ప్రయాణికులు విమానాశ్రయంలో వేచి ఉండే సమయం తగ్గుతుంది.
· ఒక అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ వ్యవస్థగా ఈ-బోర్డింగ్ వల్ల వివిధ సెక్యూరిటీ పాయింట్ల వద్ద మళ్లీ మళ్లీ తనిఖీ చేయాల్సిన అవసరం తగ్గుతుంది.
· ఎయిర్ లైన్స్ సంస్థల కార్యకలాపాలు స్ట్రీమ్‌లైన్ చేయబడి, వారు తమ వనరులను సమర్థంగా ఉపయోగించుకోగలుగుతారు.
· వివిధ చెక్ పాయింట్ల వద్ద ప్రయాణికుల రియల్ టైమ్ డేటా లభించి, తద్వారా ఆపరేషన్ సామర్థ్యాలు పెరుగుతాయి.
· విమానాశ్రయం మొత్తం నిర్వహణా సామర్థ్యాలు, భద్రత పెరుగుతాయి.
e-బోర్డింగ్ సేవలను ఉపయోగించుకునే ప్రయాణికులు ఈ క్రింది వాటిని అనుసరించాలి:
బుకింగ్
1) ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకోండి
2) వెబ్ చెక్ ఇన్ చేయండి
విమానాశ్రయం
1) డిపార్చర్ ప్రవేశ ద్వారం: డిజిటల్/ప్రింటెడ్ బోర్డింగ్ కార్డును ఇ-బోర్డింగ్ స్కానర్‌పై చూపించండి; CISF పత్రాలను ధృవీకరిస్తుంది మరియు ప్రయాణీకులను లోపలికి అనుమతిస్తుంది.
2) చెక్ ఇన్ కౌంటర్: చెక్ ఇన్ ఏజెంట్లు బోర్డింగ్ కార్డ్/లను స్కాన్ చేస్తారు; ప్రయాణీకులు లగేజ్ కౌంటర్ వద్ద తమ లగేజ్ డ్రాప్ చేస్తారు.
3) ఇమ్మిగ్రేషన్: బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ అధికారులు ప్రయాణీకుల పాస్ పోర్ట్ ధృవీకరణను పూర్తి చేస్తారు.
4) సెక్యూరిటీ స్క్రీనింగ్ జోన్: సెక్యూరిటీ చెక్ కోసం ఆటోమేటిక్ ట్రే రిట్రీవల్ సిస్టమ్ (ATRS) కదలికలపై చేతి సామాను ఉంచుతుంది. ఇ-బోర్డింగ్ స్కానర్‌లో బోర్డింగ్ కార్డును స్కాన్ చేసి ముందుకు సాగుతారు.
5) బోర్డింగ్ గేట్: బోర్డింగ్ ప్రకటన వద్ద, ఇ-బోర్డింగ్ స్కానర్‌లో బోర్డింగ్ కార్డును స్కాన్ చేసి, విమానం ఎక్కడానికి గేట్ల వైపు కదులుతారు.
అంతర్జాతీయ ప్రయాణీకులంతా ఇంటెరిమ్ ఇంటర్నేషనల్ డిపార్చర్స్ టెర్మినల్ (IIDT) నుండి ప్రయాణం చేస్తున్నారు. COVID-19 ముప్పు నుండి రక్షించడానికి టెర్మినల్ ఎంట్రీకి ముందు థర్మల్ స్క్రీనింగ్, అన్ని ప్రయాణీకుల ప్రాసెసింగ్ పాయింట్ల వద్ద ప్రత్యేక క్యూ ఏర్పాట్లు, తప్పనిసరి సామాజిక దూరం వంటి ప్రత్యేక స్క్రీనింగ్ మరియు భద్రతా చర్యలు తీసుకుంటున్నారు.
ఇటీవల హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికుల సురక్షిత ప్రయాణం, భద్రత విషయంలో తాము తీసుకుంటున్న చర్యలకు గాను ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ACI) యొక్క ఎయిర్‌పోర్ట్స్ హెల్త్ అక్రెడిటేషన్‌ను కూడా పొందింది.
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం 2015 డిసెంబర్‌లో దేశీయ విమాన ప్రయాణికులకు e-బోర్డింగ్ సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చింది. విమానాశ్రయం ప్రస్తుతం ప్రతి షెడ్యూల్డ్ దేశీయ కార్యకలాపాలకు e-బోర్డింగ్ సదుపాయాన్ని అందిస్తోంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి