34 దేశాలపై నిషేధం, మరిన్ని దేశాల్ని చేర్చే అవకాశం

- October 27, 2020 , by Maagulf
34 దేశాలపై నిషేధం, మరిన్ని దేశాల్ని చేర్చే అవకాశం

కువైట్ సిటీ:34 దేశాల నుంచి ప్రయాణీకుల డైరెక్ట్‌ ఎంట్రీపై నిషేధం కొనసాగనుంది. సోమవారం క్యాబినెట్‌ భేటీ జరగ్గా, ఈ విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో, నిషేధం మరిన్ని రోజులు కొనసాగుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా, అదనంగా మరికొన్ని దేశాల్ని ఈ నిషేధ జాబితాలోకి తీసుకువచ్చే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. కాగా, క్వారంటైన్‌ పీరియడ్‌ కూడా రెండు వారాలు కొనసాగనుంది. ఇంటర్నేషనల్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్స్‌ రికమండేషన్స్‌ నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని కొనసాగిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com