దుబాయ్:ఈ వారంతంలోనూ అల్ షిందాఖా సొరంగ మార్గం మూసివేత
- October 30, 2020
దుబాయ్:దుబాయ్ లోని అల్ షిందాఖా సొరంగ మార్గం తాత్కాలిక మూసివేత ఈ వారంలో కూడా కొనసాగుతుందని ఆర్టీఏ అధికారులు స్పష్టం చేశారు. ఈ సొరంగ మార్గాన్ని కొన్నాళ్లుగా వారంలో రెండు రోజులు మూసివేస్తున్న విషయం తెలిసిందే. ఈ వారంతంలోనూ సొరంగ మార్గంలో వాహనాలకు అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు. శుక్రవారం అర్ధరాత్రి 12.30 నుంచి ఉదయం 10.30 వరకు, తిరిగి శనివారం అర్ధరాత్రి 12.30 నుంచి ఉదయం 8 గంటల వరకు టన్నెల్ రోడ్డును మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వాహనదారులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి అల్ మక్తూమ్ బ్రిడ్జి, అల్ గర్‌హౌడ్ బ్రిడ్జి రోడ్డును ప్రత్యామ్నాయ రహదారిగా వినియోగించుకోవాలని ఆర్టీఏ సూచించింది. సొరంగ మార్గం మూసివేతతో X13, X02, 8, 95, C01, C03, C07, C09, C18, E306, X23 రూట్లో వెళ్లే బస్సులు ఆలస్యంగా నడిచే అవకాశాలు ఉన్నాయని ఆర్టీఏ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!