అయోధ్య లో దీపావళి శోభ
- November 09, 2020
అయోధ్య లో దీపోత్సవానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నవంబర్ 11 నుంచి 13 మధ్య జరిగే ఈ దీపాల పండుగలో ఈసారి 5.51 లక్షల దీపాలను వెలిగించనున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. రామజన్మభూమి- అయోధ్య వివాదం కేసులో సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు తర్వాత జరుపుకొంటున్న తొలి దీపావళి కావడంతో ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదే విధంగా రామ మందిర నిర్మాణానికి భూమి పూజ(ఆగష్టు 5) తర్వాత జరగనున్న అయోధ్యలో మొదటి వేడుక కానుండడంతో ప్రత్యేకత సంతరించుకుంది.
ఈ నేపథ్యంలో ఈసారి మరింత ప్రత్యేకంగా దీపోత్సవాన్ని నిర్వహించేందుకు యోగి సర్కారు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా సీఎం ఆదేశాలతో శ్రీరామ జన్మభూమితో పాటు కనక భవన్, రామ్ పైడి, హనుమాన్ ఘర్ ఆలయాలను అంగరంగ వైభవంగా అలంకరించేందుకు నిర్వహకులు సిద్ధమవుతున్నారు. ఇక ఈ శుభ సందర్భంలో, మొట్ట మొదటి సారిగా ఆవుపేడతో చేసిన దీపాలను ఈ వేడుకలో వాడుతున్నారు. యూపీ ప్రభుత్వం ఈ ఉత్సవాలకు 20 జానపద నృత్య బృందాలను ఆహ్వానించింది. ఇక సీఎం యోగికి అయోధ్యతో మంచి అనుబంధం ఉన్న విషయం అందరికీ తెలిసిందే.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!