ఒడిశాలో మరోసారి పృథ్వీ-2 క్షిపణి పరీక్ష

- February 16, 2016 , by Maagulf
ఒడిశాలో మరోసారి పృథ్వీ-2 క్షిపణి పరీక్ష

ఒడిశాలోని చాందీపూర్‌ టెస్ట్‌రేంజ్‌ పరిధిలో డీఆర్‌డీవో, స్ట్రాటజిక్‌ ఫోర్స్‌ కమాండో అధికారులు మంగళవారం పృథ్వీ-2 పరీక్ష నిర్వహించారు. పృథ్వీ-2 క్షిపణిని పూర్తి స్థాయి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి పరిచారు. 350 కిలోమీటర్ల పరిధిలో 500-1000 కిలోల బరువు గల వార్‌హెడ్స్‌ను మోసుకుపోవడం ఈ క్షిపణి ప్రత్యేకత. సైన్యం యూజర్‌ ట్రయల్‌లో భాగంగా దీన్ని ఈరోజు మరోసారి పరీక్షించారు. పృథ్వీ-2 క్షిపణి అధునాతనమైన వ్యవస్థతో నిర్దేశిత లక్ష్యం కదలికలను బట్టి తన దిశను సొంతంగా మార్చుకోగలదు. క్షిపణి దిశను అధికారులు ఒడిశాలోని డీఆర్‌డీవో రాడార్లు, ఎలక్ట్రో ఆప్టికల్‌ ట్రాకింగ్‌ వ్యవస్థ, టెలీమెట్రీ స్టేషన్ల ద్వారా పరీక్షించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com