308 పతకాలను తన ఖాతాలో వేసుకున్న భారత్
- February 16, 2016
గత కొన్ని రోజులుగా ఎంతో అట్టహాసంగా జరిగిన దక్షిణాసియా క్రీడలు ఇక్కడ ఇందిరా గాంధీ అథ్లెటిక్ స్టేడియంలో మంగళవారం ముగిశాయి.ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్ర క్రీడాశాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ దక్షిణాసియా క్రీడలు ముగిసినట్లు ప్రకటించారు. మరోవైపు ముగింపు కార్యక్రమంలో అసోం ముఖ్యమంత్రి తరుణ్ గోగాయ్ తో పాటు మేఘాలయ క్రీడా మంత్రి జనిత్ ఎమ్ సంగ్మాలు పాల్గొన్నారు. ఈసారి దక్షిణాసియా క్రీడలను అసోం-మేఘాలయాలు సంయుక్తంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.ఈ పోటీలకు మూడోసారి ఆతిథ్యమిచ్చిన భారత్.. అన్ని విభాగాల్లోనూ తనదైన ముద్రవేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఆది నుంచి ఆధిపత్యం కొనసాగించిన భారత్ అదే ఊపును చివరి రోజు కూడా కనబరించింది.
తద్వారా 308 పతకాలను తన ఖాతాలో వేసుకున్న భారత్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఇందులో 188 స్వర్ణపతకాలు, 90 రజత పతకాలు, 30 కాంస్య పతకాలను భారత్ సాధించింది. కాగా, 186(25 స్వర్ణాలు, 63 రజతాలు, 98 కాంస్యాలు) పతకాలతో శ్రీలంక రెండో స్థానంలో నిలవగా, పాకిస్తాన్ 106 (12 స్వర్ణాలు, 37 రజతాలు, 57 కాంస్యాలు) పతకాలతో మూడో స్థానం సాధించింది. 12 రోజుల పాటు జరిగిన దక్షిణాసియా క్రీడల్లో ఎనిమిది దేశాలు పాల్గొన్నాయి. దాదాపు 2,500 పైగా అథ్లెటిక్స్ ఈ పోటీల్లో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









