దుబాయ్:ఇండియన్ కాన్పులేట్ లో దివాళి వేడుకలు..మతసామరస్యం వెల్లివిరిసేలా వేడుక

- November 13, 2020 , by Maagulf
దుబాయ్:ఇండియన్ కాన్పులేట్ లో దివాళి వేడుకలు..మతసామరస్యం వెల్లివిరిసేలా వేడుక

దుబాయ్:భిన్నత్వంలో ఏకత్వం. ఇదే భారతీయతకు ఆత్మ.  విభన్న సంస్కృతులు, మతాలు, భాషలు ఉన్నా..అంతా ఒక్కటిగా బతకటమే భారతదేశ ఔనత్యం. ఈ ఔనత్యానికి వేదికగా నిలిచింది దుబాయ్ లోని భారత దౌత్యకార్యాలయం.దివాళి వేడుకలను సర్వమత సమ్మేళనంగా అహ్లాదకర వాతావరణంలో నిర్వహించింది. కోవిడ్ మహమ్మారి వెంటాడుతున్న సమయంలోనూ అన్ని మతాల వారు కలిసి దివాళి వేడుకల్లో పాల్గొన్నారు. అబుధాబి హిందూ టెంపుల్ BAPS స్వామి బ్రహ్మవిహారిదాస్, యూఏఈ బోహ్రా సమాజిక వర్గ ప్రతినిధిగా మొహమ్మద్ ఖోముసి, మర్ తోమా చర్చి నుంచి రెవరెండ్ సిజు చెరియన్ ఫిలిప్, గురుద్వారా నుంచి సురేందర్ సింగ్ ఖందారి, జైన్ కమ్యూనిటి నుంచి చందు సిరోయా దివాళి వేడుకల్లో పాలుపంచుకున్నారు. వేడుకకు ముఖ్యఅతిథిగా హజరైన ఒమర్ అల్ ముతన్నా మాట్లాడుతూ..యూఏఈ అభివృద్ధిలో భాగస్వామ్యులు అయిన భారత సమాజం కృషిని ప్రశంసించారు. అనంతరం దుబాయ్ లోని భారత కౌన్సిల్ జనరల్ డాక్టర్ అమన్ పురి మాట్లాడుతూ..యూఏఈలోని భారతీయులకు ప్రభుత్వం అందిస్తున్న సహకారం పట్ల ధన్యవాదాలు తెలియజేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com