ఊపిరి అందక ముగ్గురు ఆసియా జాతీయుల మృతి

- November 16, 2020 , by Maagulf
ఊపిరి అందక ముగ్గురు ఆసియా జాతీయుల మృతి

మనామా:ఆసియా జాతీయులైన ముగ్గురు వ్యక్తులు మురుగు నీటి ఛాంబర్‌లో మరమ్మత్తులు చేస్తుండగా, ఊపిరి అందక ప్రాణాలు కోల్పోయారు. బుడైయా హైవేపై బని జమ్రాహ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల్ని రాకేష్‌ కుమార్‌ (వర్కర్‌), దేబాసిస్‌ సాహా (ఫిట్టర్‌), మొహమ్మద్‌ తౌసిఫ్‌ ఖాన్‌ (సైట్‌ ఇన్‌స్పెక్టర్‌)గా గుర్తించారు. మొహమ్మద్‌ అబ్దుల్‌మోహ్‌సిన్‌ అల్‌ ఖరాఫీ అండ్‌ సన్స్‌లో కుమార్‌ ఉద్యోగి. క్రౌన్‌ ఎలక్ట్రో మెకానికల్‌ సర్వీస్‌లో సాహా, ఖాన్‌ పనిచేస్తున్నారు. బహ్రెయిన్‌ సివిల్‌ డిఫెన్స్‌ ఈ కేసు విచారణ చేపట్టింది. ఈ ఘటనలో మరో వ్యక్తి అస్వస్థతకు గురికాగా అతనికి ఆసుపత్రిలో వైద్య చికిత్స అందిస్తున్నారు.

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com