గ్రాండ్ అబుదాబీ ఫెస్టివల్: సందర్శకుల కోసం ఉచిత బస్ సర్వీసులు
- November 17, 2020
అబుధాబి: షేక్ జాయెద్ హెరిటేజ్ ఫెస్టివల్ కోసం వెళ్ళే సందర్శకులకు ఉచిత పబ్లిక్ బస్‌లను సమకూర్చుతున్నట్లు ట్రాన్స్పోర్ట్ అథారిటీస్ వెల్లడించాయి. నవంబర్ 20, శుక్రవారం ఈ ఫెస్టివల్ ప్రారంభమయి, ఫిబ్రవరి 20, 2021 వరకు కొనసాగుతుంది. అల్ వత్బాలో ఈ ఫెస్టివల్ జరుగుతుంది. ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సెంటర్ (ఐటిసి) - డిపార్ట్మెంట్ ఆఫ్ మునిసిపాలిటీస్ అండ్ ట్రాన్స్పోర్ట్, అబుదాబీ వెల్లడించిన వివరాల ప్రకారం, సందర్శకుల్ని తరలించేందుకు తగిన వ్యూహం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అబుదాబీ మెయిన్ బస్ స్టాండ్‌లో ఈ ఉచిత బస్సులు సందర్శకులకు అందుబాటులో వుంటాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రతి గంటకూ బస్సు అందుబాటులో వుంటుంది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు తిరుగు ప్రయాణమయ్యేందుకు బస్సులు అందుబాటులో వుంటాయి. మూడు నెలల పాటు జరిగే ఫెస్టివల్లో 3,500 యాక్టివిటీస్ వుంటాయి.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!