న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమవుతున్న దుబాయ్

- November 20, 2020 , by Maagulf
న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమవుతున్న దుబాయ్

దుబాయ్ ఐకాన్ బుర్జ్ ఖలిఫా కొత్త సంవత్సరం వేడుకలకు సిద్ధమవుతోంది. భారీగా ఫైర్ వర్క్స్, లేజర్ షోలు, లైటింగ్ తో కళ్లు మిరుమిట్లు గొలిపేలా న్యూ ఇయర్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తామని చెబుతోంది రియల్ ఏస్టేట్ దిగ్గజ సంస్థ ఎమార్. ప్రతీ వేడుకను జనం గుర్తుంచుకునేలా వరల్డ్ క్లాస్ ఎక్స్ పీరియన్స్ తో నిర్వహించటం తమ సంస్థ డీఎన్ఏలోనే ఉందని వెల్లడించిన ఎమార్ వ్యవస్థాకులు మొహమ్మద్ అలబ్బేర్...2021 న్యూ ఇయర్ ను కూడా అదే రేంజ్ లో సెలబ్రేట్ చేస్తామని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచమంతా కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, అయితే..ఈ సంక్లిష్ట పరిస్థితుల్లోనూ తాము ఒక్కటిగా ఉండి సవాళ్లను ఎదుర్కొనేందుకు సమర్ధవంతంగా ఉన్నామని, వచ్చే ఏడాదిని మరింత పట్టుదలతో, కసితో గతంలో కంటే ఎక్కువ అభివృద్ధి సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం
చేశారు. అయితే..కొత్త సంవత్సరం వేడుకలను ఘనంగా ఏర్పాట్లు చేస్తూనే...కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వం సూచించిన మార్గనిర్దేశకాలను కూడా పాటిస్తామని తెలిపారు. వేడుకలకు హజరయ్యే ప్రతి వ్యక్తి ఆరోగ్య సంరక్షణ తమకు ముఖ్యమని, అందుకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ధర్మల్ కెమెరాలను ఏర్పాటు చేయటంతో పాటు, భౌతిక దూరం పాటించటం, డిజిటల్ పే మేంట్స్, ఎప్పటికప్పుడు పరిసరాలను డిసిన్ఫెక్షన్ చేయటం వంటి చర్యలు తీసుకుంటామని వివరించారు. ఇదిలాఉంటే...బుర్జ్ ఖలిఫా దగ్గర జరిగే కొత్త సంవత్సరం వేడుకలను ప్రపంచమంతా mydubainewyear.com ద్వారా ప్రత్యక్షప్రసారం చేస్తామని వెల్లడించారు. ​

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com