కోవిడ్ ను కంట్రోల్ చేసే సమర్ధతను జీ20 నిరూపించుకుందన్న సౌదీ రాజు

- November 21, 2020 , by Maagulf
కోవిడ్ ను కంట్రోల్ చేసే సమర్ధతను జీ20 నిరూపించుకుందన్న సౌదీ రాజు

సౌదీ: ప్రపంచానికి సవాల్ గా మారిన కోవిడ్ ను సమర్ధవంతంగా నియంత్రించగలిగే సత్తాను జీ20 నిరూపించుకోగలిగిందని సౌదీ అరేబియా రాజు సల్మాన్ అన్నారు. జీ20 దేశాధినేతల హజరయ్యే సదస్సుకు ఆతిథ్యమివ్వటం తమకు సంతోషంగా ఉందన్నారు. కరోనా వైరస్ ను నియంత్రించటంలో జీ20 సభ్య దేశాలు ఒకరికొకరు సహకరించుకుంటూ సమర్ధవంతమైన చర్యలు తీసుకుందని ప్రశంసించారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యకరంగా, సంపన్నమైన భవిష్యత్తును పొందెందుకు కృషి చేయటం ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించాలని అభిప్రాయపడ్డారు. తొలిసారిగా సౌదీ అధ్యక్షతన జరగబోతున్న జీ20 సదస్సులో ప్రపంచ దేశాలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సోషియోఎకానమి సవాళ్లపై చర్చించనుందని వివరించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com