రస్‌ అల్‌ ఖైమా కు విమానాల్ని ప్రారంభించనున్న స్పైస్‌జెట్‌

- November 21, 2020 , by Maagulf
రస్‌ అల్‌ ఖైమా కు విమానాల్ని ప్రారంభించనున్న స్పైస్‌జెట్‌

యూఏఈ: నవంబర్‌ 26న తొలి కమర్షియల్‌ విమానం ఇండియా నుంచి (కరోనా పాండమిక్‌ మొదలయిన తర్వాత) రస్‌ అల్‌ ఖైమా విమానాశ్రయంలో దిగనుందని ఎయిర్‌ పోర్ట్‌ వర్గాలు వెల్లడించాయి. వారానికి రెండు సార్లు స్పైస్‌జెట్‌ విమానాలు ఇండియా - రస్‌ అల్‌ ఖైమా మధ్య తిరగనున్నాయి. ఇండియాలోని ఢిల్లీలోగల ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రస్‌ అల్‌ ఖైమా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని స్పైస్‌జెట్‌ విమానాలు కనెక్ట్‌ చేయనున్నాయి. 189 మంది ప్రయాణీకు సామర్థ్యంతో బోయింగ్‌ 737-800 విమానాలు ఈ సర్వీసుల్ని అందిస్తాయి. గురువారం అలాగే శనివారం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరతాయి. శుక్రవారం ఉదయం అలాగే సోమవారం ఉదయం ఈ విమానాలు రస్‌ అల్‌ ఖైమా చేరుకుంటాయి. సోమవారం అలాగే శుక్రవారం ఈ విమానాలు ఢిల్లీలో తిరిగి ల్యాండ్‌ అవుతాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com