భారత్‌లో కొత్తగా 44,059 పాజిటివ్‌ కేసులు

- November 23, 2020 , by Maagulf
భారత్‌లో కొత్తగా 44,059 పాజిటివ్‌ కేసులు

న్యూఢిల్లీ: భారత్‌లో కొత్తగా కరోనా కేసులపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 44,059 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 91,39,866 కి చేరింది. ఇక గత 24 గంటల్లో 41,024 మంది కోలుకున్నారు. గడచిన 24 గంట‌ల సమయంలో 511 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,33,738 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 85,62,642 మంది కోలుకున్నారు. 4,43,486 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 13,25,82,730 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 8,49,596 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com