తెలంగాణలో కొత్తగా 602 కరోనా కేసులు

- November 23, 2020 , by Maagulf
తెలంగాణలో కొత్తగా 602 కరోనా కేసులు

హైదరాబాద్‌: తెలంగాణలె కొత్తగా 602 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం… గత 24 గంటల్లో ముగ్గురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 1,015 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,64,128 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,51,468 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,433 కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 11,227 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 8,942 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 129 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 62 కేసులు నిర్ధారణ అయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com