వైద్య పరికరాల దిగుమతికి ముందస్తు అనుమతి తప్పనిసరి

- November 23, 2020 , by Maagulf
వైద్య పరికరాల దిగుమతికి ముందస్తు అనుమతి తప్పనిసరి

మస్కట్‌: వైద్య పరికరాల్ని ఒమన్‌ నుంచి దిగుమతి చేసుకోవడం అలాగే ఎగుమతి చేయడానికి సంబంధించి ముందస్తు అనుమతి తప్పనిసరిగా పొందాల్సిందేనని స్పష్టం చేసింది హెల్త్‌ మినిస్ట్రీ. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ ఓ ప్రకటన చేసింది. మినిస్ట్రీకి చెందిన అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా జనవరి 1 నుంచి ముందస్తు అనుమతులు పొందవచ్చు. ఇప్పటిదాకా మినిస్ట్రీతో రిజిస్టర్‌ కాని ఆయా సంస్థలు ఖచ్చితంగా వీలైనంత త్వరగా రిజిస్టర్‌ చేసుకోవాలని మినిస్ట్రీ సూచించింది. మెయిల్‌ ద్వారా లేదా ఫోన్‌ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com