అల్లు శత జయంతి ఉత్సవాల కమిటీలోకి వంశీ గ్లోబల్ అవార్డ్స్ కి స్వాగతం - అల్లు అరవింద్
- November 23, 2020
పద్మశ్రీ డా అల్లు రామలింగయ్య - వంశీ ఉత్తమ జర్నలిస్ట్ పురస్కారం - 2020 , సి. శ్రీకాంత్ కుమార్ పద్మశ్రీ తుర్లపాటి కుటుటుంబరావు , డా జి. సమరం గారి చేతుల మీదుగా విజయవాడలోని వాసవ్య కేంద్రంలో అందుకున్నారు.
అంతర్జాలం ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుప్రసిద్ధ సినీ నిర్మాత, గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ప్రసంగిస్తూ వచ్చే ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుండి 2022 అక్టోబర్ 1వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై తదితర చోట్ల కూడా తమ తండ్రి అల్లు రామలింగయ్య శత జయంతుత్సవాలను ఒక ఏడాది పట్టు ఘనంగా నిర్వహించేలా ప్రణాళికలు చేశామన్నారు.
ఈ లోపు పద్మశ్రీ డా అల్లురామలింగయ్య జీవిత చిత్రం పుస్తకాన్ని 2010 లో రచించిన సి. శ్రీకాంత్ కుమార్ కృషి గుర్తించి ఈ 2020 లో వంశీ ఉత్తమ జర్నలిస్ట్ పురస్కారంతో సత్కరిస్తునందుకు సంతోషంగా ఉందని ముందస్తుగానే ఈ వేడుకల్ని ప్రారంభించిన వంశీ గ్లోబల్ అవార్డ్స్ రామరాజు గారిని ఎంతగానో అభినందిస్తున్నానని అన్నారు. శ్రీకాంత్ కుమార్ అల్లు రామలింగయ్య తో 6 సంవత్సరాల పాటు ప్రయాణం చేసారని వారిపై ప్రేమాభిమానాలతో పుస్తక రచన చేపట్టి విజయవంతగా పూర్తి చేసినందుకు మరోసారి అభినందిస్తూ
పుస్తకాన్ని ప్రచురించాలని అందుకు తన పూర్తి సహకారం ఉంటుందని తెలుపుతూ శత జయంతి వేడుకల కమిటీలో పాలుపంచుకోవాలని వంశీ రామరాజుని స్వాగతించారు ఏ సందర్భంగా శ్రీకాంత్ కుమార్ ని తమ కుటుంబానికి పరిచయం చేసిన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ మేనేజర్ ఆర్. స్వామి నాయుడు గారిని కూడా అభినందిస్తున్నారు. కార్య్కర్మంలో పాల్గొన్న అతిధులు పద్మశ్రీ డా తుర్లపాటి కుటుంబరావు అల్లు రామలింగయ్య తో తమ దంపతుల అనుబంధాన్ని స్మరించుకుంటే తమ కుటుంబంతో నాస్తిక కేంద్రంతో రామలింగయ్య గరికున్న అవినాభావ సంబంధాన్ని డా.జి.సమరం ఉద్వేగంగా వివరిస్తూ విజయవాడలోని వియ్యంకులు ఇంటికి వచ్చినాకూడా వెంటనే మా ఇంటికి వచ్చేసి ఎంతో ఆహ్లదంగా గడిపేవారు 2004 మే నెలలో విజయవాడలో తాము చేసిన సన్మానం ఆఖరి సన్మానమౌతుందని అనుకోలేదన్నారు చిరంజీవి అల్లు అరవింద్ లతో తనకున్న బంధాన్ని డా. జి. సమరం వివరించారు శారదా కళా సమితి విజయవాడ అధ్యక్షులు దోగిపర్తి శంకరరావు అల్లురామలింగయ్య తో తన ప్రయాణాన్ని వివరిస్తే సుప్రసిద్ధ సినీదర్శకులు రేలంగి నరసింహారావు తాను డా దాసరి నారాయణ రావు వద్ద శిష్యుడిగా ఉన్ననాటి నుండి అల్లు రామలింగయ్య తో ప్రత్యేకానుబంధాన్ని కలగి ఉండేదాన్ని అస్తక్తికరంగా చెప్పుకొస్తూ తెలుగు అసోసియేషన్ ట్రస్ట్ డా.పి.వీ కిల్లి వంశీ అధ్యక్షులు డా.తెన్నేటి సుధా దేవి మేనేజింగ్ ట్రస్ట్ శైలజ సుంకరపల్లి పాల్గొన్నారు పురస్కార గ్రహీత సి.శ్రీకాంత్ కుమార్ ప్రసంగిస్తూ వంశీ రామరాజు ఫోన్ చేసి ఉత్తమ జర్నలిస్ట్ పురస్కారానికి ఎంపిక చేశారని చెప్పగానే ఆశ్చర్యనందాలకు లోనయ్యానని పద్మశ్రీ డా.అల్లు రామలింగయ్య ఆశీస్సులు తనపై ఉన్నాయని భావించానన్నారు.
అల్లు శాత జయంతి వేడుకలకు మరింత అద్భుతంగా పుస్తకాన్ని తీర్చిదిద్ది తీసుకువస్తున్నట్లు తెలుపుతూ వంశీ గ్లోబల్ అవార్డ్స్ సంస్థకు రామరాజు కి తాను ఋణపడిఉంటానని చెప్పారు...
కార్యక్రమానికి ఆద్యంతం వ్యాలీ వేదిక అమెరికా శారదకాశీ వఝల నిర్వహించగా వంశీ గ్లోబల్ అవార్డ్స్ ఇండియా కళా బ్రహ్మ శిరోమణి డా.వంశీ రామరాజు సమన్వయం చేస్తూ విజయవంతంగా నిర్వహించారు.
మా ఇద్దరి స్వస్థలం పాలకొల్లు కావడంతో ఎవరిబాబువి అనడిగారని డాక్టర్ రంగనాయకులు గారి అబ్బాయిని అని చెప్పగానే అప్పటినుంచి ఎప్పుడు నన్ను డాక్టర్ గారి అబ్బాయి అనే సంబోదించేవారని అన్నారు సంతోషం సినీ వార్త పత్రిక అధినేత సురేష్ కొండేటి మాట్లాడుతూ అల్లు రామలింగయ్య గారున్నారు మాదీ పాలకొల్లే అని ధైర్యంతో ఇండస్ట్రీలోకి నేను అడుగుపెట్టడానికి కారణం వారేనని శ్రీకాంత్ కుమార్ తో 20 సం||లకి పైగా తనకు అనుబంధం ఉందని సంతోషం సినీ పత్రిక ప్రారంభించిన నాటినుండీ ఎన్నో రచనలు అందించారని సంతోషం అవార్డ్స్ ఈవెంట్లో కూడా తన సహకారం ఎంతో ఉందని తెలిపారు.
సన్మానపత్రన్ని విమ్మరేస్ ప్రకాష్ రావు అద్భుతంగా రచించడమే కాక వారే చదివి వినిపించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న ప్రజా నటి కళాభారతి జమునారమణా రావు ప్రసంగిస్తూ తాను రామలింగయ్య గారు 1952 లో పుట్టిల్లు సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేశామని నాటినుండి వారు అదే అనుబంధాన్ని చివరివరకూ కొనసాగించారని అల్లు అరవింద్ అప్పటికి నాలుగేళ్ళ పిల్లాడని గురుతుచేసుకున్నారు.
కార్యక్రమంలో వంగూరి ఫౌండేషన్ అమెరికా అధ్యక్షులు వంగూరి చిట్టెన్ రాజు అమెరికా ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ నటరాజ్ ఇల్లూరి యునైటెడ్ తెలుగు కింగ్ డామ్.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన