అమరవీరులకు నివాళులు అర్పించిన యూఏఈ

- November 30, 2020 , by Maagulf
అమరవీరులకు నివాళులు అర్పించిన యూఏఈ

యూఏఈ: జాతిని రక్షించేందుకు ప్రాణాలు ఒడ్డిన అమరవీరుల జ్ఞాపక దినోత్సవంగా నవంబర్ 30 ను ప్రతి ఏటా అమరవీరుల స్మారకదినోత్సవంగా జరుపుకుంటోంది యూఏఈ.

అమరవీరుల కుటుంబాల వ్యవహారాల కార్యాలయం, యూఏఈ లోని ఎమిరాతీస్ మరియు ప్రవాసీయులను ఉద్దేశించి  ఉదయం 11.31 గంటల వరకు ఒక నిమిషం నిశ్శబ్దాన్ని పాటించవలసిందిగా కోరుతూ పంపిన ఎస్ఎంఎస్ ను అనుసరించి నేడు సరిగ్గా ఉదయం 11.30 గంటలకు యూఏఈ లోని ఎమిరాతీస్ మరియు ప్రవాసులు ఒక నిమిషం మౌనం పాటిస్తూ సైనికులకు నివాళులర్పించారు. 

నివాసితులు వారి ప్రశంస సందేశాలను #Proud_of_your_sacrifices ఉపయోగించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయమని యూఏఈ కోరింది. దీంతో ఈ హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో టాప్ ట్రెండ్ గా మారింది.
 
అబుధాబి క్రౌన్ ప్రిన్స్ మరియు యూఏఈ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వీరులకు నివాళులు అర్పించారు. యూఏఈ లోని ఉన్నతాధికారులు సైతం తమ నివాళులు అర్పించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com