సౌదీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ షో వాయిదా

- December 03, 2020 , by Maagulf
సౌదీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ షో వాయిదా

రియాద్:రెండవ ఇంటర్నేషనల్‌ ఎక్స్‌పో ఫర్‌ ఏవియేషన్‌ అండ్‌ స్పేస్‌ - సౌదీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ షో, రియాద్‌లోని అల్‌ తిమ్మా ఎయిర్‌ పోర్ట్‌లో 2021 ప్రథమార్థంలో జరగాల్సి వుండగా, అది వాయిదా పడింది. వాస్తవానికి షెడ్యూల్‌ ప్రకారం ఈ ఎయిర్‌ షో ఫిబ్రవరి 16 నుంచి ఫిబ్రవరి 18 వరకు జరగాల్సి వుంది. కరోనా నేపథ్యంలో ఈ ఎయిర్‌ షోని వాయిదా వేస్తున్నట్లు సౌదీ ఏవియేషన్‌ క్లబ్‌ వెల్లడించింది. ఎప్పటికి ఈ పోస్ట్‌పోన్‌మెంట్‌ జరిగింది.? అన్నదాని విషయమై నిర్వాహకులు స్పష్టతనివ్వలేదు. కరోనా సెకెండ్‌ వేవ్‌ కారణంగా ఆయా దేశాల్లో తిరిగి అమల్లోకి వస్తున్న లాక్‌డౌన్‌ నేపథ్యంలోనే వాయిదా నిర్ణయం తీసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com