ఐసిస్ వారి ఆఫర్లు!!

- May 27, 2015 , by Maagulf
ఐసిస్ వారి ఆఫర్లు!!

ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాదులు హానీమూన్ ట్రిప్, కుటుంబ సభ్యులకు స్టైఫండ్ పేరుతో యువకులను తమ వైపు ఆకర్షిస్తున్నారు. ఐసిస్ ఉగ్రవాదులు తీవ్ర ఘాతుకాలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. చాలామంది యువత ఐసిస్‌లో చేరుతున్నారు. ఆ యువతను ప్రధానంగా హానీమూన్ ట్రిప్ పేరుతో ఐసిస్ తమ వైపుకు లాగుతోంది. ఒక్కో ఫ్యామిలికీ ఎక్కువలో ఎక్కువగా పదిహేనువందల డాలర్ల వరకు స్టైఫాండ్ ఇచ్చేందుకు సిద్ధమవుతోందట. ఐసిస్ ఫైటర్ అబు బిలాల్ అల్ హోమ్సీ అనే ఐటీ ప్రొఫెషనల్ ఇలాగే ఇస్లామిక్ స్టేట్ యుద్ధంలో చేరాడు. ఐసిస్‌లో చేరకముందు అతనికి ఓ యువతితో పరిచయం ఏర్పడింది. పెళ్లికి సిద్ధమయ్యారు. ఆమెతో నిత్యం చాటింగ్ చేసేవాడు. ఆమె ఇతని ఇస్లామిక్ ఆలోచనల పట్ల ఆకర్షితురాలైంది. వారు ఆన్ లైన్లో చాటింగ్ చేసుకునే వారు. కొద్ది రోజుల అనంతరం అతను ఆ యువతి సోదరుడిని పెళ్లి విషయమై అడిగేందుకు వచ్చాడు. అదే సమయంలో 24 ఏళ్ల ఆ యువతి కూడా టర్కీకి చేరుకుంది. అనంతరం వారిద్దరు కలుసుకున్నారు. కొద్ది రోజులు హానీమూన్ చేసుకున్నారు. అయితే, ఆ యువతి సోదరుడు అప్పటికే ఐసిస్ ఉగ్రవాదంలో ఉన్నాడు. హానీమూన్ తర్వాత హోమ్సీ ఐసిస్ ఉగ్రవాదుల స్థావరానికి చేరుకున్నాడు. అతనికి ఐసిస్ ఉగ్రవాదులు నిధులు ఇచ్చారు. వారి పిల్లలకు నాలుగు వందల డాలర్లు ఇస్తామని చెప్పారు. ప్రస్తుతం వారికి నెలకు యాభై డాలర్లు ఇస్తున్నారు. అలాగే అతని భార్యకు కూడా ఇస్తున్నారు.                 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com