కోవిడ్-19 వ్యాక్సిన్ల ఎగుమతి, దిగుమతులకు సిద్ధంగా ఉన్న GMR హైదరాబాద్ ఎయిర్ కార్గో

- December 08, 2020 , by Maagulf
కోవిడ్-19 వ్యాక్సిన్ల ఎగుమతి, దిగుమతులకు సిద్ధంగా ఉన్న GMR హైదరాబాద్ ఎయిర్ కార్గో

హైదరాబాద్:ప్రపంచంలోని అనేక దేశాలు కోవిడ్-19 సెకెండ్ వేవ్‌ను ఎదుర్కొంటూ, మళ్లీ లాక్‌డౌన్ విధిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ మహమ్మారిపై పోరాటానికి ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ పరీక్షలు పూర్తిస్థాయిలో జరుగుతున్నాయి. గత దశాబ్దంలో, ప్రపంచ వ్యాక్సిన్లలో 60% ఉత్పత్తి చేసే గ్లోబల్ ఫార్మాస్యూటికల్స్ మరియు టీకా కేంద్రంగా భారతదేశం అవతరించింది. దీనిలో భారతదేశ ఫార్మా హబ్, వ్యాక్సిన్ క్యాపిటల్‌గా పేరుగాంచి, ప్రపంచ వ్యాక్సిన్ సరఫరాలో మూడో వంతుకు పైగా ఉత్పత్తి చేస్తూ హైదరాబాద్ అతి పెద్ద సరఫరాదారుగా గుర్తింపు పొందింది. ఇక్కడ ఉన్న సమర్థమైన సాంకేతిక పరిజ్ఞానం కారణంగా కోవిడ్ -19 వ్యాక్సిన్లను ఇక్కడి నుంచి మిలియన్ల మోతాదులలో ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అయితే, వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడం సగం సమస్య మాత్రమే. భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా వాటిని పంపిణీ చేయడమన్నది అతి పెద్ద సవాలుగా నిలుస్తుంది. అదృష్టవశాత్తూ, వ్యాక్సిన్ల రవాణాకు సాధ్యమైనంత మెరుగైన రవాణా ఏర్పాట్లు జరిగేలా కొన్ని సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయి.

ఈ నేపథ్యంలో, గ్లోబల్ వ్యాక్సిన్ల రవాణాకు, వ్యాక్సిన్ల సమగ్రతను కాపాడటానికి ఆటంకాలు లేని కూల్ చైన్ సదుపాయాలు అవసరం. ఇలాంటి ఎన్నో సదుపాయాలు కలిగిన జిఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో వ్యాక్సిన్ల రవానాలో ప్రధాన పాత్రను పోషించనుంది. 

కోవిడ్-19 వ్యాక్సిన్లకు ప్రత్యేకమైన నిర్వహణ అవసరం. అందువల్ల తయారీదారుల కేంద్రం నుండి తుది గమ్యస్థానానికి వ్యాక్సిన్లను రవాణా చేసే ప్రక్రియలో ఉన్న ఆటంకాలను తొలగించడానికి ఉత్పత్తిదారులు మరియు సప్లై-చైన్ భాగస్వాముల సమన్వయంతో పలు విధానాలను రూపొందిస్తున్నారు. 

ముందున్న సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యాలు

  • GMR హైదరాబాద్ ఎయిర్ కార్గోలో నిర్ధిష్టమైన ఉష్ణోగ్రతల మధ్య వ్యాక్సిన్లను స్వీకరించడం, పరీక్షించడం, నిర్వహించడం కోసం ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలు (SOP) ఉన్నాయి. టెర్మినల్ యొక్క ఫార్మా జోన్ WHO-GSDP చే (ప్రపంచ ఆరోగ్య సంస్థ - మంచి నిల్వ మరియు పంపిణీ పద్ధతులు) ధృవీకరించబడింది.
  • ఔషధ, వ్యాక్సిన్ రవాణా కోసం GMR హైదరాబాద్ ఎయిర్ కార్గో మొదటి నుంచి చివరి వరకు ఎలాంటి ఆటంకాలు లేని కూల్-చైన్ అందిస్తుంది.
  • వ్యాక్సిన్లు అత్యంత సున్నితమైనవి కావడం వల్ల GHAC తాను గత 12 సంవత్సరాల కార్యకలాపాల నుండి ఫార్మాను నిర్వహించడంలో ఉన్న సామర్థ్యాన్ని ఆటంకాలు లేని కూల్-చైన్ నిర్వహించడానికి ఉపయోగించుకుంటోంది. GHAC టెర్మినల్, ఎన్విరోటైనర్, వాక్యూటెక్ లాంటి భారతదేశపు అత్యాధునిక టెంపరేచర్ – కంట్రోల్డ్ కూల్ కంటైనర్లను అందిస్తుంది. GHAC ఇటీవల టెంపరేచర్ సెన్సిటివ్ ఫార్మా మరియు వ్యాక్సిన్ సరుకుల వాయుమార్గం రవాణా కోసం మొబైల్ శీతలీకరణ యూనిట్ కూల్ డాలీని కూడా ప్రారంభించింది.
  • సెన్సిటివ్ వ్యాక్సిన్ షిప్‌మెంట్లను హ్యాండిల్ చేసేటప్పుడు మెరుగైన పర్యవేక్షణ, నియంత్రణ కోసం కూల్ జోన్లు/కంటైనర్లలో ఉష్ణోగ్రత డేటా లాగర్లు మరియు హ్యూమిడిటీ (తేమ) సెన్సార్లు ఉంటాయి.
  • స్క్రీనింగ్ చేసేటప్పుడు వ్యాక్సిన్ల కూల్ కంటైనర్లు పాడు కాకుండా ఉండడానికి GHAC లో డ్యూయల్ వ్యూ టన్నెల్ ఎక్స్-రే స్క్రీనింగ్ మెషీన్ ఉంది.
  • ప్రపంచవ్యాప్తంగా ఎగుమతులు మరియు దిగుమతుల కోసం GHAC ఇప్పటికే వివిధ సాంప్రదాయ వ్యాక్సిన్ షిప్మెంట్లను హ్యాండిల్ చేస్తోంది. క్లిష్టమైన వ్యాక్సిన్లను ఎలాంటి ఆటంకాలూ లేకుండా రవాణా చేయడానికి GHAC ఫార్మా జోన్ ను సమర్థవంతంగా రూపొందించారు.
  • ఉష్ణోగ్రత-నియంత్రిత కండిషన్స్‌లో స్వీకరించడం, తూకం వేయడం, కస్టమ్స్ పరీక్షలు, స్క్రీనింగ్, ప్యాలెటైజేషన్ మరియు విమానాలకు రవాణా వంటి క్లిష్టమైన ప్రక్రియలు కూడా ఇక్కడ జరుగుతాయి.

సవాళ్లను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్న GHAC

  • పారిశ్రామిక వర్గాల ప్రకారం, భారతదేశం నుంచి వ్యాక్సిన్ల ఎగుమతిలో ఎక్కువ భాగం ఆఫ్రికా, లాటిన్ అమెరికా మరియు ఆసియాలకు ఉంటుంది. ఐరోపా మరియు ఇతర ప్రాంతాల నుండి అవసరమైన ముడిసరుకులను పొందవచ్చు. ప్రస్తుతం ప్రయోగదశలో ఉన్న అనేక తయారీదారులు వ్యాక్సిన్స తయారీలో పురోగతి సాధిస్తే, వ్యాక్సిన్ల రవాణాలో హైదరాబాద్ ఒక ప్రధాన కేంద్రంగా అవతరించడానికి సిద్ధంగా ఉంది.
  • కోవిడ్ వ్యాక్సిన్ల ఎగుమతి, దిగుమతి అవసరాలను తీర్చడానికి GHAC వివిధ భాగస్వాములతో చర్చలు జరుపుతోంది. వీటిలో అనేక స్థాయిల్లో కోల్డ్, అల్ట్రా-కోల్డ్ మైనస్ ఉష్ణోగ్రతలు ఉండటం ఒక సవాలుగా మారింది.
  •  ప్రస్తుతం, జిఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో హైదరాబాద్ నుండి ఫార్మా, వ్యాక్సిన్ల రవాణాను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి ల్యాండ్‌సైడ్ మరియు ఎయిర్‌సైడ్ సౌకర్యాలను విస్తరించే పనిలో ఉంది.
  •  ప్రస్తుతం వివిధ రకాల  వ్యాక్సిన్లు, సంబంధిత ఉపకరణాలు, సామాగ్రి కోసం నిల్వ సామర్థ్యాన్ని పెంచడానికి GHAC ప్రణాళికలు రూపందిస్తోంది. GHAC తమ వద్ద పెద్ద ఎత్తున స్టాక్‌ను నిలువ ఉంచుకోవడానికి కూల్ కంటైనర్ ప్రొవైడర్లతో కలిసి పనిచేస్తోంది. అంతే కాకుండా కూల్ కంటైనర్ నిల్వ సామర్థ్యాన్ని అప్‌గ్రేడ్ చేస్తూ, కూల్ కంటైనర్‌ల కదలికల పెరుగుదలకు అనుగుణంగా వాటి ఛార్జింగ్ ప్రదేశాలను పెంచుతోంది. 
  • వ్యాక్సిన్ బాక్సులను వేగంగా మెకనైజ్డ్ విధానంలో నిర్వహించడానికి, సరుకుల బ్రేకేజ్/లీకేజీని నివారించడానికి, వాహనాల అనుకూలత కోసం ట్రక్ డాక్ ప్రాంతంలో డాక్ లెవెలర్స్‌ను ఏర్పాటు చేసారు. మొత్తం ఫార్మా జోన్ ఉష్ణోగ్రత, హ్యుమిడిటీ (తేమ) సెన్సార్లతో కూడిన అలారం హెచ్చరికలతో పాటు, సీసీటీవీ సర్వైలెన్స్ లాంటివి రియల్ టైమ్ లో ఉష్ణోగ్రతలను నియంత్రణలో ఉంచుతాయి. వ్యాక్సిన్లు/ఫార్మా వంటి టెంపరేచర్ సెన్సిటివ్ సరుకుల కోసం ప్రత్యేకమైన కోల్డ్ స్టోరేజ్‌లో డేటా లాగర్‌లతో ఉష్ణోగ్రత రికార్డింగ్ మరియు పర్యవేక్షణ జరుగుతోంది.
  • అతి తక్కువ సమయంలో ఎక్కువ సరుకులను హ్యాండిల్ చేయడానికి GHAC సరుకు రవాణా ఫార్వార్డర్లు మరియు వాణిజ్య సభ్యులతో కలిసి పని చేస్తోంది. టెంపరేచర్ సెన్సిటివ్ ఫార్మా, వ్యాక్సిన్ల రవాణా కోసం తన నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడానికి ట్రక్ డాక్ మరియు ఫార్మా జోన్ విస్తరణను చేపడుతోంది. దీని వల్ల కార్గో స్వీకరణ, ప్రాసెసింగ్ సమయం కూడా తగ్గుతుంది, కార్గో జోన్ కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచుతుంది.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com