COVID19: చైనా వ్యాక్సిన్ ‘సినోఫార్మ్’ వాడకానికి ఆమోదం తెలిపిన యూఏఈ
- December 09, 2020
యూఏఈ: బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ ప్రొడక్ట్ కనుగొన్న క్రియారహిత కోవిడ్ -19 వ్యాక్సిన్ 'సినోఫార్మ్' వాడుకను సామూహికంగా ఉపయోగించేందుకు అధికారికంగా ఆమోదం తెలిపిన యూఏఈ ఆరోగ్య మరియు నివారణ మంత్రిత్వ శాఖ 'మొహప్'.
మొహప్ మరియు అబుధాబి ఆరోగ్య శాఖ (DOH) సంయుక్తంగా చేపట్టిన సినోఫార్మ్ CNBG మూడవ దశ ట్రయల్స్ విశ్లేషించగా కరోనా వ్యాధి సక్రమించకుండా అడ్డుకోవడంలో 86 శాతం సామర్థ్యాన్ని కలిగి ఉందని నిరూపణ అయింది. యాంటీబాడీ ఉత్పత్తి చేయటంలో 99% మరియు వ్యాధినిరోధక శక్తిని పెంచటంలో 100% ఈ వ్యాక్సిన్ ఫలితాలు సమర్ధవంతంగా ఉన్నాయని తెలిసింది. మరీ ముఖ్యంగా ఈ వ్యాక్సిన్ ఎటువంటి ప్రాణాంతక సమస్యలను మూడు దశలుగా నిర్వహించిన క్లినికల్ ట్రైల్స్ (125 జాతీయతలలో 31,000 మంది వాలంటీర్లు పాల్గొన్న) లో చూపకపోవడం గమనార్హం.
ఈ వ్యాక్సిన్‌కు కోవిడ్ -19 ప్రమాదం ఎక్కువగా ఉన్న ఫ్రంట్‌లైన్ కార్మికులను రక్షించడానికి మొహప్ సెప్టెంబర్ నుండి ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ (EUA) ను మంజూరు చేసింది.
EUA ప్రోగ్రామ్ యొక్క పోస్ట్ ఆథరైజేషన్ సేఫ్టీ స్టడీ (PASS) మరియు పోస్ట్ ఆథరైజేషన్ ఎఫిషియసీ స్టడీ (PAES) ను యూఏఈ నిర్వహిస్తోంది.ఈ కొనసాగుతున్న అధ్యయనాలు కూడా సానుకూల ఫలితాలను చూపుతున్నాయని ఆరోగ్య శాఖ అధికారులు ధృవీకరించారు.
అధికారికంగా ప్రజలందరూ ఈ వ్యాక్సిన్ వాడటానికి 'సినోఫార్మ్ సిఎన్‌బిజి' నుండి వచ్చిన దరఖాస్తుకు స్పందిస్తూ యూఏఈ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వ్యాక్సిన్ అందించిన సానుకూల ఫలితాలను దృష్టి పెట్టుకొని దాని సమర్థతపై విశ్వాసంతో యూఏఈ ఈ ప్రకటన చేసిందని అధికారులు తెలిపారు. దేశ ప్రజలను సమగ్రంగా రక్షించడానికి మరియు ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు ఈ వ్యాక్సిన్ దోహదం చేస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..







