ఆమ్నెస్టీని ఉపయోగించుకుంది 400 మంది ఇల్లీగల్‌ రెసిడెంట్స్‌ మాత్రమే

- December 09, 2020 , by Maagulf
ఆమ్నెస్టీని ఉపయోగించుకుంది 400 మంది ఇల్లీగల్‌ రెసిడెంట్స్‌ మాత్రమే

కువైట్ సిటీ:ఇప్పటిదాకాకేవలం 400 మంది ఇల్లీగల్‌ రెసిడెంట్స్‌ మాత్రమే ఆమ్నెస్టీని వినియోగించుకున్నారు. తమ రెసిడెన్సీ స్టేటస్‌ని సరి చేసుకోవడానికి కువైట్‌ నాయకత్వం ఇచ్చిన ఆమ్నెస్టీని ఇంకా పెద్ద సంఖ్యలో ఇల్లీగల్‌ రెసిడెంట్స్‌ వినియోగించుకోవాల్సి వుంది. 130,000 మందికి పైగా ఉల్లంఘనులు దేశంలో వున్నారని తెలుస్తోంది. డిసెంబర్‌ 1 నుంచి 31 వరకు ఈ ఆమ్నెస్టీ అందుబాటులో వుంటుంది. అయితే, తొలి వారంలో కేవలం 400 మంది మాత్రమే ఆమ్నెస్టీని వినియోగించుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వీలైనంత త్వరగా ఇల్లీగల్‌ రెసిడెంట్స్‌ తమ రెసిడెన్సీని సరిచేసుకోవాల్సి వుంటుందనీ, ఆమ్నెస్టీ గడువు ముగించాక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com