రెండు లక్షలకు అమ్మాయిల అమ్మకం..పాతబస్తీలో జరుగుతున్న దారుణం
- December 10, 2020
హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. దుబాయ్ లో పని ఆశ చూపి అమ్మాయిల్ని అరబ్ షేక్ లకు అమ్ముతున్న ముఠా గుట్టు రట్టయ్యింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన గురించిన వివరాలు.
పాతబస్తీలోని పేద ముస్లిం మహిళలకు దుబాయ్ లో ఉద్యోగం పేరుతో ఆశ కల్పిస్తున్నారు కొంతమంది బ్రోకర్లు. అక్కడికి వెళ్లాలంటే దుబాయ్ షేక్ లను పెళ్లి చేసుకోవాలని నమ్మిస్తున్నారు. అలా షేక్ ల దగ్గర రెండు లక్షల రూపాయలు తీసుకుని అమ్మాయిల్ని అప్పజెపుతున్నారు.
ఆ తరువాత మహిళల్ని విజిటింగ్ వీసీ పేరుతో దుబాయ్ పంపిస్తున్నారు. ఇలా ఇప్పటికి ఐదుగురు మహిళల్ని బస్తీ బ్రోకర్లు అమ్మినట్టు సమాచారం. ఈ విషయం వెలుగులోకి రావడంతో బాధిత మహిళల కుటుంబ సభ్యులు తమవారి కోసం విదేశీ వ్యవహారాల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఇదిల ఉంటే పాతబస్తీలో తాజాగా ట్రిపుల్ తలాక్ కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. అమెరికా నుంచి ఫోన్లో తన భార్యకు అదివలి అనే వ్యక్తి తలాక్ చెప్పాడని బాధితురాలు సభా ఫాతిమా తెలిపారు. పాతబస్తీకి చెందిన సభా ఫాతిమాను వలి వివాహం చేసుకున్నాడు.
ప్రస్తుతం ఫాతిమా భర్త అమెరికాలో ఉంటున్నాడు. తన భర్త వలి అమెరికా నుంచి ఫోన్లో మూడుసార్లు తలాక్ అని చెప్పాడని ఫాతిమా ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలంటూ కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖను ఆమె గురువారం ఆశ్రయించారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







