ఏలూరు లో అదుపులోకి వస్తున్న కేసులు...
- December 12, 2020
ఏలూరు: ఏలూరు లో నిన్నటిదాకా కంటిమీద కునుకు కరువయ్యింది. వింత లక్షణాలతో పశ్చిమగోదావరినే కాదు…మొత్తం రాష్ట్రాన్నే వణికించిన మహమ్మారి..
వింత లక్షణాలతో పశ్చిమగోదావరినే కాదు…మొత్తం రాష్ట్రాన్నే వణికించిన మహమ్మారి కంట్రోల్లోకి వస్తోంది. ఇవాళ కొత్త కేసులేం లేకపోవటంతో….గండం గడిచినట్లే అనుకుంటున్నారు అధికారులు, నేతలు. అది ఏ జబ్బో తెలీదు..ఏ మందు ఇవ్వాలో తెలీదు…ఎక్కడికక్కడ నురగలు కక్కుతూ పడిపోయిన ఘటనలో ఏలూరులో చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు వారం రోజులపాటు ఈ భయానక వాతావరణం నెలకొంది. వందా రెండొందలు మూడొందలు…ఇలా మొదట్లో బాధితుల సంఖ్య పెరుగుతూ పోయింది. దీనికి ముగింపెక్కడో తెలీక అంతా కలవరపడ్డారు. పరుగులుపెట్టారు.
ఎలాగైతేనేం.. చివరికి సిట్యువేషన్ అండర్ కంట్రోల్. మొత్తం బాధితులు 614మందిలో 576మంది డిశ్చార్జి అయ్యారు. ఏలూరులో అర్థరాత్రి నుంచి కొత్త కేసులేవీ రాకపోవటంతో పరిస్థితి పూర్తి నియంత్రణలోకి వచ్చినట్లేనని భావిస్తున్నారు. మరోవైపు తాగునీటి పరిశుభ్రతపై ఏలూరు మున్సిపాలిటీ ప్రత్యేక దృష్టిపెట్టింది. దీంతో వింత వ్యాధి ప్రబలిన బాధిత ప్రాంతాల్లో నీటి సరఫరా మెరుగుపడింది. కాగా, తుదినివేదికలన్నీ అందాకే వ్యాధి లక్షణాలకు కారణాలపై ప్రభుత్వం ఓ నిర్ధారణకు రాబోతోంది. అప్పటిదాకా కొత్తగా ఏమైనా కేసులొచ్చినా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలున్నాయి. కోలుకుని ఇంటికి వెళ్లిన బాధితుల ఆరోగ్యపరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు వైద్యారోగ్యశాఖ అధికారులు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







