ఏలూరు లో అదుపులోకి వస్తున్న కేసులు...

- December 12, 2020 , by Maagulf
ఏలూరు లో అదుపులోకి వస్తున్న కేసులు...

ఏలూరు: ఏలూరు లో నిన్నటిదాకా కంటిమీద కునుకు కరువయ్యింది. వింత లక్షణాలతో పశ్చిమగోదావరినే కాదు…మొత్తం రాష్ట్రాన్నే వణికించిన మహమ్మారి..
వింత లక్షణాలతో పశ్చిమగోదావరినే కాదు…మొత్తం రాష్ట్రాన్నే వణికించిన మహమ్మారి కంట్రోల్‌లోకి వస్తోంది. ఇవాళ కొత్త కేసులేం లేకపోవటంతో….గండం గడిచినట్లే అనుకుంటున్నారు అధికారులు, నేతలు. అది ఏ జబ్బో తెలీదు..ఏ మందు ఇవ్వాలో తెలీదు…ఎక్కడికక్కడ నురగలు కక్కుతూ పడిపోయిన ఘటనలో ఏలూరులో చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు వారం రోజులపాటు ఈ భయానక వాతావరణం నెలకొంది. వందా రెండొందలు మూడొందలు…ఇలా మొదట్లో బాధితుల సంఖ్య పెరుగుతూ పోయింది. దీనికి ముగింపెక్కడో తెలీక అంతా కలవరపడ్డారు. పరుగులుపెట్టారు.

ఎలాగైతేనేం.. చివరికి సిట్యువేషన్‌ అండర్‌ కంట్రోల్‌. మొత్తం బాధితులు 614మందిలో 576మంది డిశ్చార్జి అయ్యారు. ఏలూరులో అర్థరాత్రి నుంచి కొత్త కేసులేవీ రాకపోవటంతో పరిస్థితి పూర్తి నియంత్రణలోకి వచ్చినట్లేనని భావిస్తున్నారు. మరోవైపు తాగునీటి పరిశుభ్రతపై ఏలూరు మున్సిపాలిటీ ప్రత్యేక దృష్టిపెట్టింది. దీంతో వింత వ్యాధి ప్రబలిన బాధిత ప్రాంతాల్లో నీటి సరఫరా మెరుగుపడింది. కాగా, తుదినివేదికలన్నీ అందాకే వ్యాధి లక్షణాలకు కారణాలపై ప్రభుత్వం ఓ నిర్ధారణకు రాబోతోంది. అప్పటిదాకా కొత్తగా ఏమైనా కేసులొచ్చినా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలున్నాయి. కోలుకుని ఇంటికి వెళ్లిన బాధితుల ఆరోగ్యపరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు వైద్యారోగ్యశాఖ అధికారులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com