బెండకాయలను నానబెట్టిన నీటిని తాగితే..
- December 14, 2020బెండకాయలను రాత్రి పూట నీటిలో నానబెట్టి ఆ నీటిని ఉదయాన్నే తాగితే చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. చిన్న బెండకాయలు రెండు లేదా మూడు తీసుకుని వాటిని బాగా కడిగి చివరు, మొదలు కట్ చేసి తీసెయ్యాలి. బెండకాయలను నిలువుగా కట్ చేసి అవి మునిగేలా నీటిని పోయాలి. ఇలా రాత్రంతా బెండకాయ ముక్కల్ని నీటిలో ఉంచితే అవి బాగా నాని వాటిలోని పోషకాలన్నీ నీటిలోకి చేరతాయి. ఉదయాన్నేబెండకాయ ముక్కల్ని తీసేసి ఆ నీటిని తాగితే ఆరోగ్య ప్రయోజనాలు మన సొంతమవుతాయి. ఈ నీటిని తాగడం వలన మన పొట్టలోని పేగులు, జీర్ణాయాన్ని శుభ్రపరుస్తాయి. ఎసిడిటి, గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలు దూరమవుతాయి. బెండకాయల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దాంతో తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణం కావడానికి ఈ నీరు ఉపయోగపడుతుంది. ఇంకా ఈ నీటిని తాగడం వలన రక్త ప్రసరణ బాగా జరిగి హైబీపీ తగ్గుతుంది. గుండె పని తీరు మెరుగుపరిచేందుకు కూడ ఈ నీరు ఎంతో మేలు చేస్తుంది. టైప్2 డయాబెటిస్ ఉన్న వారు షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచడానిక బెండకాయ నీరు పనిచేస్తుంది. కంటి చూపుని మెరుగుపరుస్తుంది. చర్మ సమస్యలు, జుట్టు రాలే సమస్యలను నివారిస్తుంది.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!