ఎయిర్ హోస్టెస్ గా సౌదీ మహిళలకు అవకాశం..
- December 30, 2020
రియాద్:మహిళా స్వాలంభన దిశగా సంస్కరణల బాట పట్టిన సౌదీ ప్రభుత్వం..ఇక విమానయాన రంగంలోనూ మహిళలకు ప్రాధాన్యం ఇస్తోంది. సౌదీ ఎయిర్ లైన్స్ లో 50 మంది ఎయిర్ హోస్టెస్ గా నియామకాలు చేపట్టేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా స్వాలంభనే కాకుండా స్థానికులకు ఉపాధి అవకాశాలను కల్పించే లక్ష్యంలో భాగంగా ఈ నియామకాలను చేపట్టింది. సౌదీ ఎయిర్ లైన్స్ తమ కో పైలట్ సిబ్బందిలో వంద శాతం సౌదీ ప్రజలనే భర్తీ చేసే ప్రక్రియను ఇటీవలె పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు ఎయిర్ హోస్టెస్ విషయంలోనూ స్థానికులతో భర్తీ చేస్తోంది. తొలిగా 50 మంది మహిళల నియామకానికి సిద్ధపడింది. సౌదీ ఎయిర్ వేస్ లో హోస్టెస్ గా చేరాలనుకుంటున్న వారు 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న వారు అర్హులు. కనీసం సెకండరీ ఎడ్యూకేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎయిర్ లైన్స్ స్టాండర్ట్స్ ప్రకారం ఎత్తుకు తగినట్లు నిర్దేశించిన బరువు ఉండాలి. మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి తుది భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: Gautam Gambhir changes handshake protocol after Pakistan match
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!